మంచి విందు భోజనంలాంటి సినిమా ET (ఎవరికీ తలవంచడు): డైరెక్టర్ పాండిరాజ్
వెర్సటైల్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ET (ఎవరికీ తలవంచడు)’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదల అవుతుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. సినిమా ట్రైలర్ సినిమా ఉన్న అంచనాలను మరింత పెంచాయి. సినిమా విడుదల సందర్భంగా సినిమా గురించి డైరెక్టర్ పాండిరాజ్ ఇంటర్వ్యూ...
ET (ఎవరికీ తలవంచడు) సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుంది.. డైరెక్టర్‌గా ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా?
అలాంటిదేమీ లేదండి.. నిజానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే.. ముందు మేం ET సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనే రూపొందించాలని అనుకున్నాం. కానీ చివరకు నేను ఈ సినిమాలో చెప్పాలనుకున్న విషయం దేశంలో చాలా చోట్ల మహిళలు ఎదుర్కొంటున్నవే. కాబట్టి.. సినిమాను మలయాళ, కన్నడ, హిందీల్లోనూ విడుదల చేయాలనుకున్నాం. అలా ET పాన్ ఇండియా సినిమా అయ్యింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి విందు భోజనంలాంటి సినిమాగా రూపొందించాను. ఇలా అన్నీ వర్గాలను సమపాళ్లలో మిక్స్ చేసి సినిమా చేయడం సవాలుగా అనిపించింది.
ఇప్పటి వరకు పాండిరాజ్ సినిమా అంటే ఫ్యామిలీ టచ్ ఉంటుందనే భావన ఉంది.. మరి ET సినిమాను కూడా ఆ కోణంలోనే చూడొచ్చా?
ఇప్పటి వరకు నేను డైరెక్ట్ చేసిన సినిమాలు చూసిన ప్రేక్షకులకు పాండిరాజ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయనే ఆలోచన ఉంటుందనడంలో సందేహం లేదు. ET సినిమా విషయానికి వస్తే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండటంతో పాటు.. నా సినిమాల్లో మీరు ఊహించని విధంగా.. ఇప్పటి వరకు చూడని మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎలాంటి మాస్ మూవీస్‌లను చూడాలని కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్‌ను అన్నింటినీ ఈ సినిమాలో తెరకెక్కించాం. యాక్షన్ ఎలిమెంట్స్‌లోనూ ఓ ఎమోషన్‌ను జోడించాం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.సూర్య కథ వినగానే ఏమన్నారు?
సూర్యగారిని కలిసి కథ నెరేట్ చేసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పాల్సిన కథ ఇదే సార్. మెయిన్ కాన్సెప్ట్ సూపర్‌గా ఉంది. నా సినిమా ద్వారా ఈ విషయం చెప్పాలనుకున్నందుకు మీకు థాంక్స్ చెప్పాలని అన్నారు సూర్య.
సూర్య.. కార్తి ఇద్దరితో సినిమా చేశారు.. వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది?
ఇద్దరూ జెన్యూన్‌గా ఉంటారు. సినిమా బెటర్‌గా రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. డైరెక్టర్ కంటే సినిమా బాగా రావాలని కోరుకుంటారు. అలాగే ఏ విషయాన్ని అయినా చెప్పాలనుకున్నప్పుడు నొప్పించకుండా చెప్పాలని కోరుకుంటారు. చుట్టూ ఉన్న వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.