For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Manchu Manoj : త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తా.. మీ బ్లేస్సింగ్స్ కావాలంటూ : మంచు మనోజ్

09:14 PM Jan 18, 2023 IST | Sowmya
Updated At - 09:14 PM Jan 18, 2023 IST
manchu manoj   త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తా   మీ బ్లేస్సింగ్స్ కావాలంటూ   మంచు మనోజ్
Advertisement

Manchu Manoj : ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా తన నటవారసత్వాన్ని కొనసాగిస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దొంగ దొంగది అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు ఈ యండ్ హీరో. ఆ తర్వాత బిందాస్, రాజు భాయ్, శ్రీ, కరెంటు తీగ లాంటి హిట్ సినిమాల్లో నటించాడు. అయితే కరెంటు తీగ సినిమా తర్వాత మనోజ్ చివరిసారిగా 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో క్యామియోస్ చేశాడు. దాదాపు ఐదేళ్ల నుంచి మనోజ్ వెండితెరపై కనిపించలేదు.

అయితే మంచు మనోజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన ప్రణతి అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే వారి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు కూడా తీసుకున్నాడు. అయితే దివంగత టిడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డితో అతడు ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు మీడియా కంటపడగా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని తెలిసింది.

Advertisement GKSC

తాజాగా మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నా హృదయానికి దగ్గరైన ప్రత్యేక విషయాన్ని కొంతకాలంగా నాలోనే దాచుకున్నా. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. దీనికి సంబంధించిన వివరాల్ని జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పట్లాగే మీ అందరి ఆశీస్సులూ కావాలి’’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. కొందరు మనోజ్ కొత్త చిత్రం గురించి అయ్యుంటుందని భావిస్తుంటే.. ఇంకొందరు మనోజ్ రెండో పెళ్లి గురించి కావొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం రోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది. చూడాలి మరి ఈ యంగ్ హీరో ఏం చెప్తాడో అని.

Advertisement
Author Image