Entertainment : చల్ ఛయ్యా ఛయ్యా పాటలో మలైకా ఆరోరాకు ఎలా అవకాశం వచ్చిందంటే..
Entertainment 50 ఏళ్ల వయసులో కూడా కుర్ర కారును ఉర్రూతలూగిస్తున్న మలైకా అరోరా మంచి డాన్సర్ కూడా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన దిల్సే చిత్రంలో ఓ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే అయితే ఇందులో ముందుగా మలైకాను అనుకోలేదంట మరి తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే..
స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన దిల్ సే చిత్రంలో చల్ ఛయ్యా ఛయ్యా సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది ఇప్పటికే ఆ సాంగ్ వింటే ఎక్కడికైనా ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సాంగ్లో షారుక్ తో కలిసి చిందేసిన భామ మలైకా అరోరా.. ఈ సాంగ్ అంత సూపర్ హిట్ అవడంతో ఆమెకు ఎక్కడలేని స్టార్ స్టేటస్ వచ్చేసింది అయితే ఇందుకోసం మొదటగా మలైకాను అనుకోలేదంట. ఐదుగురు హీరోయిన్లు అడగగా వారంతా నో చెప్పడంతో ఈ అవకాశం వరించిందని తాజాగా మూవీంగ్ ఇన్ విత్ మలైకా ప్రారంభ కార్యక్రమంలో తెలిసింది..
ఇందులో మొదటిగా శిల్పా శెట్టిని అనుకున్నారంట ఆమె కాదనటంతో శిల్పా శిరోద్కర్ను అడిగిన ఆమె కూడా కాదని చెప్పిందంట ఆ తర్వాత మరో ముగ్గురు నటి మనల్ని అడిగితే వారంతా రకరకాల కారణాలతో చెప్పటంతో మలైకా మంచి డాన్సర్ అని కొరియోగ్రాఫర్ అనడంతో ఈ సినిమాకు మలైకాను తీసుకున్నారంట అయితే వారంతా కాదనటానికి కారణం కదులుతున్న ట్రైన్ పైన డాన్స్ చేయడం వల్ల కాదు అని భయపడ్డారంట కానీ ఈ పాటను ఒప్పుకున్న మలైకా మాత్రం ఆ తర్వాత మంచి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది..