For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ ఘనంగా బతుకమ్మ సంభరాలు

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
మలేషియా తెలంగాణ అసోసియేషన్  మైట  ఆధ్వర్యములొ ఘనంగా బతుకమ్మ సంభరాలు
Advertisement

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ పూల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడం తో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమయిన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా యువతులనే తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేసారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెరాస పార్టీ శాసన సభ సభ్యుడు శ్రీ గాదారి కిషోర్ కుమార్ గారు, బీజేపీ శాసన సభ సభ్యుడు శ్రీ రఘు నందన్ గారు, సూర్యాపేట జిల్ల్లా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి గుజ్జ దీపికా యుగేందర్ గారు, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి సుష్మ గారు, మరియు మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement GKSC

Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022 Kuala Lumpur, Malaysia,Telugu Golden TV,V9 News Telugu,www.teluguworldnow.com,My Mix Et,telugu world newsశ్రీ రఘునందన్ గారు గారు మాట్లాడతూ... ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి ప్రమాదవశాతూ మరణించిన వారికీ మైట తరపున సహాయ సహకారాలు అందచేస్తున్న మైట కోర్ కమిటీ సబ్యులను అభినందించారు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మునుముందు ఇలాగే కొనసాగించాలని కోరారు దీనికి కావాలసిన సహాయ సహకారాలు భారత ప్రభుత్వం తరపున మరియు తెలంగాణ ప్రభుతం తరపున శాసన సభ సభ్యుడి గ హామీ ఇచ్చారు.

శ్రీ గాదారి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియా లో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ అభినందించారు. మై ట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చిన మైట మరియు తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే మైట కు కావలసిన సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం తరఫును ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సంధర్బముగా నిర్వహించిన ఉత్సవాలలో ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. ఈ వేడుకల్లో సుమారుగా వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అలాగే అందంగా అలంకరించిన బతుకమ్మల కు జెన్ టాక్టు కంపెనీ తరపున కృష్ణ వర్మ గారు 6గ్రాముల బంగారు బహుమతులను అందజేశారు అంతే కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికీ KVT గోల్డ్ ,మలబార్ గోల్డ్ ,జస్ బెలూన్స్ వారు బంగారు బహుమతులను అందజేశారు.

మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన ఏవౌస్, జెన్ టాక్టు, లావు టెక్ సోలుషన్స్ , అక్యూమెంట్ ఇన్ఫోటెక్ , ఆలివ్ టెక్నాలజీస్ , తెరాస మలేషియా , మలబార్ గోల్డ్ , KVT గోల్డ్, జాస్ డెకొరేటర్స్ ,మినీ మార్ట్ అప్,ట్రూ ఫ్రెషిస్, శ్రీ బిర్యానీ.com రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్ , బిగ్ సి రెస్టారెంట్ , ప్రబలీ రెస్టారెంట్ , ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను, మరియు మైట సభ్యులను అయన అభినందించారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Author Image