Film Actress : కరోనా మహమ్మారి ఎఫెక్ట్... సినిమా ఛాన్స్ లు లేక రోడ్లపై టికెట్ లు అమ్ముతున్న నటి !
Film Actress : ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని అంటూ ఉంటారు. ఈ మాదిరి గానే ఈమె జీవితం కూడా ప్రస్తుతం అలా మారింది. 35 కు పైగా సినిమా ల్లోనూ, వాణిజ్య ప్రకటన ల్లోనూ నటించింది. ఆ డబ్బుతోనే కూతురు పెళ్లి ఘనంగా చేసింది. పనిలో పనిగా బ్యాంకులోని తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంది. కానీ అనుకోని అతిథిలా వచ్చిన కరోనా మహమ్మారి ఆ తార జీవితాన్ని తలకిందులు చేసింది. సినిమా ఛాన్సులు కరువవ్వడంతో... జీవనోపాధి భారమైంది. ఇక ఏం చేయాలో తెలియక రోడ్డు మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది.
ఇక ఆమె ఎవరు అనే విషయానికి వస్తే... ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ హీరోగా 2016 లో వచ్చిన సినిమా యాక్షన్ హీరో బిజు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మేరీ. ఈ సినిమా తర్వాత పైపిన్ చువత్తిలే ప్రణయం తో మరొక హిట్టు కొట్టి పలు యాడ్స్ లో కూడా నటించింది. అంతే కాదు అలా వచ్చిన డబ్బులతో ఇద్దరు కూతుర్లకు ఘనంగా పెళ్లి చేసిన ఈమె సినిమా ఆఫర్లు వస్తుండడంతో అప్పు తీర్చగలనని ఉద్దేశంతో ఇల్లు కట్టుకుంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈమె జీవితం అతలాకుతలమైంది. దీంతో కుటుంబాన్ని చూసుకోవడానికి చిన్నచితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది.
మరొక వైపు ఈమె చిన్న కుమారుడు అనారోగ్యంతో ఉండడంతో... అతడి వైద్య ఖర్చులు, బ్యాంకు లోన్ తీర్చాలంటే కచ్చితంగా మేరీ ఏదో ఒక పని చేయక తప్పదు. ఈ క్రమం లోనే రోడ్లపై లాటరీ టికెట్ అమ్ముతూ ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ తన నమ్మకాన్ని కోల్పోకుండా ఎప్పటికైనా సరే నిర్మాతలు పిలిచి తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకంతో జీవిస్తోంది మేరీ. మరి ఈమె పరిస్థితి చూసి నిర్మాతలు, నటులు మళ్ళీ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని కోరుతున్నారు.