For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ERROR500' జెస్సికి యాప్ట్ టైటిల్ : దర్శకుడు వి. ఎన్ ఆదిత్య

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
 error500  జెస్సికి యాప్ట్ టైటిల్   దర్శకుడు వి  ఎన్ ఆదిత్య
Advertisement

మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ERROR500' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. దర్శకుడు వి. ఎన్ ఆదిత్య , హీరో ఆకాష్ పూరితో పాటు బిగ్‌బాస్ రవి, సోహెల్, సిరి, కాజోల్, నేహా చౌదరి, అర్జున్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వి. ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఏమిటని సాందీప్ గారిని అడిగాను. సంతోషం సురేష్ గారు చూసారని చెప్పారు. మరో ఆలోచన లేకుండా మీ సినిమా చాలా సేఫ్ హాండ్స్ లో వుందని చెప్పాను. సురేష్ గారు వండర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్. ఆయన జడ్జ్ మెంట్ బావుంటుంది. 'ERROR500' జెస్సికి యాప్ట్ టైటిల్. ఒకేసారి మల్టిపుల్ పనులు చేయగలడు.

Advertisement GKSC

నేను రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూస్తాను. అందులో నాకు నచ్చినవారంతా ఈ వేడుక లో వుండటం ఆనందంగా వుంది. ఈ స్టేజ్ పైకి వస్తుంటే సడన్ గా ఆదిత్య 369 గుర్తుకు వస్తోంది. కాలానికి వెనక్కి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5, ముందుకు వెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చూస్తున్నట్లు అనిపించింది.  'ERROR500' ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది. జెస్సి, సాందీప్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.

Advertisement
Author Image