For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie : అర్అర్అర్ మూవీ ఆస్కార్ నామినేషన్ కు వెళ్లకపోవడానికి కారణం అదేనా..

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
movie   అర్అర్అర్ మూవీ ఆస్కార్ నామినేషన్ కు వెళ్లకపోవడానికి కారణం అదేనా
Advertisement

Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అర్అర్అర్ మూవీ ఆస్కార్ నామినేషన్ కు కచ్చితంగా వెళుతుందని అనుకున్నారు అభిమానులు. అయితే వీళ్ళ ఆశలన్నీ నిరాశ చేస్తూ అర్అర్అర్ మూవీను కాకుండా గుజరాత్ కు చెందిన 'చెల్లో షో' ను ఇండియా తరపున ఆస్కార్ నామినేషన్ కు పంపించడం చర్చనీయంశం అయింది. అయితే అర్అర్అర్ మూవీ ఆస్కార్ నామినేషన్ కు వెళ్ళాకపోవటానికి కారణాలు ఇవే అంటున్నారు..

అర్అర్అర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. అయినప్పటికీ ఆ సినిమాను వెనక్కి నెట్టి చెల్లో షో మూవీని ఆస్కార్ నామినేషన్ కు పంపించడం వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. అయితే దీనిపై స్పందించిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కమిటీ అధ్యక్షుడు టీఎస్ నాగభరణ " అర్అర్అర్ మూవీ గొప్పచిత్రమే.. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ పొందినదనో.. ఎక్కువ మంది చూసారనో సినిమాను ఆస్కార్ నామినేషన్ కు పంపలేము కదా.. ఆ మాటకు వస్తే ఇందులో ఉన్న 13 సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి.

Advertisement GKSC

అయితే చెల్లో షో మూవీ మరింత ప్రత్యేకమైనది. అందులో ఉన్న పిల్లలు వారి కలల కోసం.. వాటిని నెరవేర్చుకోవడం కోసం చేసిన కృషి అందరినీ కదిలించేదిగా ఉంది. ఆస్కార్ వాళ్లు సినిమాలో మానవీయ కోణాన్ని ఎక్కువగా చూసే అవకాశం ఉండటంతో.. ఆ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నామినేషన్ కు పంపించాం. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు.. రాజకీయ కోణాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా జ్యూరీ లో ఉన్న 17 మంది సభ్యులూ ఆ మూవీకే ఓటు వేయడంతో ఆ సినిమాని నామినేషన్ పంపించాల్సి వచ్చింది.. అర్అర్అర్ మూవీ పై ఎలాంటి వ్యతిరేకత లేదని.. సినిమాను వేరే ఏ రూపంలో అయినా ఆస్కార్ కు పంపితే తమకు ఎలాంటి అభ్యంతరం తమకు లేదని చెప్పుకొచ్చారు.

Advertisement
Author Image