నెట్టింట వైరల్ అవుతోన్న సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్ హాట్ ఫొటోస్...
Hero Mahesh Babu:టాలీవుడ్ హీరోల్లో యాడ్స్ రూపంలో అత్యధికంగా సంపాదించేవారు మొదటిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ను చెప్పుకోవచ్చు. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎన్నో ప్రొడక్ట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తనదైన స్టైల్ సినిమాలు తీస్తూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తారు. ప్రస్తుత కాలంలో హీరోలందరూ సిక్స్ ప్యాక్ లుక్స్ అంటూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తుంటే మహేష్ బాబు మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకి అనే చెప్పుకోవాలి. అయితే మహేష్ బాబు తొలిసారిగా షర్ట్ లేకుండా ఉండే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా మహేష్ బాబు సతీమణి ఈ ఫొటోస్ ను
సోషల్ మీడియా వేదికైనా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో సిమ్ చేస్తున్న లుక్ లో కనిపిస్తారు. అలానే మహేష్ బాబు సిక్స్ ప్యాక్ కూడా కనిపిస్తుంది.
ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అభిమానులు కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది హాట్ అంటూ మరి కొంతమంది అన్నయ్య న్యూ లుక్ అంటూ మరి కొందరు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కోసం న్యూ లుక్ కోసం మహేష్ బాబు కష్టపడుతున్నారు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి మహేష్ బాబు సిక్స్ ప్యాక్ రహస్యం తెలియాలి అంటే ఏడాది వరకు ఆగాల్సిందే.