Entertainment : మహేష్ జీవితంలో ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేనిది.. గర్తు చేసుకుంటున్న అభిమానులు..
Entertainment టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని మరింత ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నారా ఆయన అభిమానులు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన అభిమానులకి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు.. మరి అంత ప్రత్యేకమైన రోజు కోసం కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరి మనస్సులను దోచుకున్నాడు... తన సినీ జీవితానికి పునాదులు పడింది ఆయన మొట్టమొదటి సినిమాలో నటించింది ఈరోజే సరిగ్గా 43 సంవత్సరాల క్రితం మహేష్ తన తొలి చిత్రం అయినా నీడ సినిమాలో నటించారు.. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు
దర్శక రత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన ‘నీడ’అనే చిత్రంలో తొలిసారిగా మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. 1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో మొదటిసారి మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అప్పట్లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మహేష్ బాబుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు క్యూ కట్టాయి.. మహేష్ బాబు ఆర్టిస్ట్ గా మొత్తం 9 చిత్రాల్లో నటించారు అయితే ఇందులో దాదాపు 7 చిత్రాల వరకు తండ్రి కృష్ణతో కలిపి నటించడం విశేషం.. అయితే కొన్నాళ్లపాటు వరుసగా చిత్రాల్లో నటించడం మహేష్ తర్వాత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు మళ్ళీ చదివంత పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత రాజకుమారుడు చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు..