For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

శివ పురాణం మహత్యం 🙏 మహా శివరాత్రి ప్రత్యేకం

08:01 AM Feb 28, 2022 IST | Sowmya
Updated At - 08:01 AM Feb 28, 2022 IST
శివ పురాణం మహత్యం 🙏 మహా శివరాత్రి ప్రత్యేకం
Advertisement
తావత్కిల మహోత్పాతాః సంచరిష్యంతినిర్భయాః ! యావచ్ఛివపురాణం హినోదేష్యతి జగత్యహో !! శివపురాణం వినేవరకు మాత్రమే యమ కింకరుల భయం ఉంటుంది. అది దొరికితే వాళ్ళ భయం అక్కరలేదు. ఇతర చిన్న చిన్న శాస్త్రములన్నీ ఎంతవరకూ గర్జిస్తాయి అంటే శివపురాణం అనే సింహం గర్జించేవరకూ. సర్వ తీర్థములు సేవించిన ఫలం , సర్వ దానఫలం , శివపురాణ శ్రవణం వల్ల లభిస్తుంది. సర్వ సిద్ధాంత సారము శివపురాణంలో ఉన్నది. తథాపి తస్య మహాత్మ్యం వక్ష్యే కించిత్తు వోనఘాః ! చిత్తమాధాయ శృణుత వ్యాసేనోక్తం పురామమ !! ఆ దివ్యమైన మహాత్మ్యాన్ని , ఫలాన్ని చెప్పడం నావల్ల కూడా కాదు అన్నాడు సూతపౌరాణికులు. ఫలం వక్తుం న శక్నోమి కార్త్ స్న్యేన మునిసత్తమాః" దానియొక్క ఫలాన్ని నేను వర్ణించలేను. ఏతచ్ఛివపురాణం హి శ్లోకం శ్లోకార్థమేవచ! యః పఠేద్భక్తి సంయుక్తస్సపాపాన్ముచ్యతే క్షణాత్ !! శివపురాణంలో ఒక్క శ్లోకం గానీ , శ్లోకంలో సగం గానీ భక్తిగా చదివే వాని పాపం ఆ క్షణంలోనే నశిస్తుంది. భక్తి అనగా శ్రద్ధతో కూడినది. శ్రద్ధ అంటే ఇది సత్యము అనే విశ్వాసమే శ్రద్ధ. అలా భక్తితో ఒక్క శ్లోకంగానీ , శ్లోకార్థం గానీ చదివితే పాపములు నశిస్తాయి.
ఏతచ్ఛివ పురాణం హియః ప్రత్యహమతంద్రితః యథాశక్తి పఠేద్భక్త్యాస జీవన్ముక్త ఉచ్యతే !! ఈ శివ పురాణాన్ని ఎల్లవేళలా , భక్తితో , అతంద్రితః - కునుకుపాటు లేకుండా చదివితే జీవన్ముక్తులౌతారు. కునుకుపాటు అంటే ఏమరుపాటు , అజాగ్రత్త. ఏతచ్ఛివపురాణం హి యో భక్త్యార్చయేత్ సదా ! దినే దినేశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయమ్ !! శివపురాణమును రోజూ అర్చించినా అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఏతచ్ఛివ పురాం యస్సాధారణ పదేచ్ఛయా ! అన్యతః శృణుయాత్సోపి మత్తో ముచ్యేత పాతకాత్ !! ఏదైనా ఒక లౌకికమైన ఉన్నతిని కోరి శివపురాణం చదివినట్లైతే అది కూడా తప్పక లభిస్తుంది. పాపనాశనం జరుగుతుంది.
mahashivratri 2022,lord shiva mahashivratri special story,maha shivaratri festival impartance,shivudu god,bhakthi news,devotiona news,telugu golden tv,my mix entertainments, teluguworldnow.com.ఏతచ్ఛివపురాణం యో నమస్కుర్యాద దూరతః ! సర్వదేవార్చన ఫలం ప్రాప్నోతి న సంశయః !! పుస్తక సమీపానికి వచ్చి నమస్కరించిన వారికి దేవతలందరినీ పూజించిన ఫలం కలుగుతుంది. దీనిని రచించి యోగ్యులైన వారికి , శివభక్తులకు దానం చేస్తే సర్వవేదాధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది. దీనిని చతుర్దశి నాడు శివభక్తుల సభలలో అర్థం వివరిస్తూ చెప్పినట్లైతే చెప్పిన వారికి గాయత్రీ పునశ్చరణ ఫలం లభిస్తుంది. ఇందులో సర్వకోరికలూ తీర్చగలిగే సంహితలు చాలా ఉన్నాయి. శుభమ్ భూయత్.
* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
Advertisement
Author Image