మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేసిన `మా ఊరి పొలిమేర-2` టీజర్
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా ` రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ...``సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో తను నటించిన `మా ఊరి పొలిమేర` చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర-2` టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. మొదటి పార్ట్ లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
https://www.youtube.com/shorts/rcYhzGWX7RQ
ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; పీఆర్వోః జీకే మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఫైట్ మాస్టర్ః రామ్ మాస్టర్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్.