For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Love Today : ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన రీసెంట్ బ్లాక్ బస్టర్ " లవ్ టుడే "..!

12:40 PM May 13, 2024 IST | Sowmya
UpdateAt: 12:40 PM May 13, 2024 IST
love today   ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన రీసెంట్ బ్లాక్ బస్టర్   లవ్ టుడే
Advertisement

Love Today : తమిళంలో ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా " లవ్ టుడే ". ప్రదీప్‌ రంగనాథన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మించిన ఈ సినిమా అర‌వై కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేసి 25 వ తేదీన విడుదల చేశారు.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కాగా తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.శ‌నివారం రోజు కూడా కోటికిపైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రేమ కథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా హీరోయిన్ గా నటించింది. అలానే సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి.

Advertisement

ఇదిలా ఉంటే థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోన్న లవ్‌ టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబర్‌ 2న ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం అందుతుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Tags :
Author Image