For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌పై క్లాప్ కొట్టిన ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్.

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
film news  లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌పై క్లాప్ కొట్టిన ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్
Advertisement

Living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film, Latest Telugu Movies, Telugu World Now,

FILM NEWS: లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌పై క్లాప్ కొట్టిన ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్.

Advertisement GKSC

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్, స్టన్నింగ్‌ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్ర‌ఖ్యాత‌ నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్‌ కలిసి ఓ భారీ బడ్జెట్‌తో సినీ లవర్స్‌కు ఓ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేందుకు ఓ సూపర్భ్‌ సినిమా ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టారు.

ఈ సినిమా షూటింగ్‌ కోసం అమితాబ్‌బచ్చన్‌ హైదరాబాద్‌ వచ్చారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో అమితాబచ్చన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు నాగ్‌ అశ్విన్‌. బిగ్‌బి అమితామ్ బ‌చ్చ‌న్ మీద చిత్రీక‌రించిన ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌కు ఈ చిత్ర హీరో, ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ క్లాప్‌ ఇవ్వడం విశేషం.

`గురు పౌర్ణమి రోజున‌ ఇండియన్‌ సినిమా గురు అమితాబ్ గారిమీద క్లాప్ కొట్ట‌డం గౌర‌వంగా భావిస్తున్నాను` అని ప్ర‌భాస్ తెలిపారు.

‘‘బాహుబలి’ సినిమాతో మనదేశంలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్‌ మ్యాజికల్‌ వేవ్స్‌ను విస్తరింపజేసిన ఐకాన్‌ ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కె’ (వ‌ర్కింగ్ టైటిల్‌) ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ ఇవ్వడాన్ని గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను’’ అని అమితాబ్‌ బచ్చన్ తెలిపారు.

దివంగత ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొంది, జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి’ సినిమాకు దర్శకత్వం వహించిన నాగ్‌అశ్విన్‌ ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ, కాన్సెప్ట్, తెరకెక్కించే విధానంగా ప్రేక్షకులకు కొత్తగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇండియన్‌ పవర్‌హౌస్‌ యాక్టర్స్, అత్యున్నత సాంకేతిక నిపుణులు అసోసియేటై ఉన్నారు. అంతర్జాతీయ నటీనటులు ఈ సినిమాలో భాగమైయ్యారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు వీపరితంగా పెరిగిపోయాయి. షూటింగ్‌ మొదలైన తొలిరోజే ఈ సినిమాను గురించి ఫిల్మ్‌ ట్రేడ్‌లో చర్చ జరుగుతుంది.

ఈ సినిమా చిత్రీకరణ కోసం రామోజీఫిల్మ్‌సిటీలో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు చిత్ర యూనిట్‌. ఇండియన్‌ సినిమాల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న సినిమా సెట్‌ ఇది.

ప్రతిష్టాత్మకమైన నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన హిట్స్, ప్రేక్షకులకు గుర్తిండిపోయే సినిమాలను అందించిన సీనియర్‌ నిర్మాత సి. అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ నిర్మాణరంగంలో విజయవతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే..

ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనె, దర్శకులు నాగ్‌ అశ్విన్ మ‌రియు ఇండియన్‌ సినిమాలోని ప్రముఖ సినీ తారల కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రేక్షకుల‌కు మునుపెన్నడూ ఆస్వాదించని గొప్ప అనుభూతిని తప్పక అందిస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement
Author Image