For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Like Share & Subscribe అడ్వంచర్ యాక్షన్ కామెడీ : హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
like share   subscribe అడ్వంచర్ యాక్షన్ కామెడీ   హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ
Advertisement

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథలో మిమ్మల్ని  ఆకర్షించిన అంశాలు ఏమిటి ? 

Advertisement GKSC

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో  ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?

ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది.  థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది.

జాతిరత్నాలు, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ని ప్రభాస్ గారు విడుదల చేయడం ఎలా అనిపించింది ?

లక్కీ ఛార్మ్ గా ఫీలౌతున్నా.  జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.

హీరో సంతోష్ శోభన్ గురించి ?

సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది.

Santhosh Shobhan, Faria Abdullah, Merlapaka Gandhi, Amukta Creations, Niharika Entertainments 'Like Share & Subscribe' Theatrical Trailer Launched by Rebel Star Prabhas,Telugu Golden TV

దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్ గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?

చాలా అడ్వంచర్ మూవీ ఇది. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ).

మీ మొదటి సినిమా జాతిరత్నాలు లో 'చిట్టి' పాత్రకు మంచి పేరొచ్చింది కదా.. ఆ పేరుతోనే పిలుస్తున్నారు.. ఈ విషయంలో  భాద్యత పెరిగిందని అనిపిస్తుందా ?

'చిట్టి' పాత్రని అందరూ అభిమానించారు. చిట్టి అనేది ఒక ఎమోషన్ గా మారింది. ఈ విషయం లో ఆనందంతో పాటు భాద్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వందశాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమాలో చిట్టి కాదు వసుధనే కనిపిస్తుంది.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సుదర్శన్ కి మీకు మంచి కాంబినేషన్ ఉంటుందని విన్నాం ?

అవును.  సుదర్శన్ ఫన్నీ పర్శన్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ కథ చాలా లో ఎంటర్టైన్మెంట్ వుంది.

మరో రెండేళ్ళలో ఇలా వుండాలానే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ?

రెండేళ్ళు కాదు కానీ.. మరో ఐదేళ్ళతో పాన్ వరల్డ్ వుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తమిళ్ లో సుసీంధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరో గా ఒక సినిమా చేస్తున్న. సుసీంధిరన్ గారు ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పక్కాగా వుంటానని వారు చెప్పడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.

Santosh Shobhan, Faria Abdullah, Merlapaka Gandhi, Amukta Creations, Niharika Entertainments Like Share & Subscribe Release Date Announcement Press Meet - Movie Grand Release on 4th November

ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలని అనుకుంటున్నారు.. లిమిటేషన్లు ఏమైనా ఉన్నాయా ?

లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

రవితేజ రావణాసుర, ఒక తమిళ్ మూవీ, ఒక హిందీ సిరిస్ చేస్తున్నా.

దర్శకత్వం పై ఆసక్తి వుందని చెప్పారు కదా ఎలాంటి సినిమాలు చేస్తారు ?

నాకు ఆర్ట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం. అలాగే మ్యూజికల్ ఫిలిమ్స్ కూడా ఇష్టం. అయితే దర్శకత్వం ఇప్పుడు కాదు.. మరో పదేళ్ళు పడుతుంది.

అల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image