For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

లైగర్ కుమ్మేస్తుంది.. నేను గ్యారెంటీ.. ఆగస్టు 25న వాట్ లగా దేంగే

10:39 AM May 13, 2024 IST | Sowmya
Updated At - 10:39 AM May 13, 2024 IST
లైగర్ కుమ్మేస్తుంది   నేను గ్యారెంటీ   ఆగస్టు 25న వాట్ లగా దేంగే
Advertisement

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌ బ్రీడ్) ఆగస్టు 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో గుంటూరులో  'లైగర్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా  జరిగింది. భారీ సంఖ్యలో జనాలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

https://youtube.com/shorts/aJodOlemUSs

Advertisement GKSC

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఎప్పటినుండో మీ దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత అద్భుతమైన సినిమాని మీ దగ్గరికి తీసుకురావాలని ఎంతగానో ఎదురుచూశాను. అయితే సరైన సమయంలో లైఫ్ లో డ్రామా,..హెల్త్, బాడీ సపోర్ట్ చేయడం లేదు. ప్రమోషన్స్ లో రోజుకో సిటీలో ఉంటున్నాం. అయితే ఈ రోజు ఇక్కడ నిలుచుని మాట్లాడటానికి కారణం మీరు ఇస్తున్న ప్రేమ. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన అమితంగా ప్రేమించారు. ఆ ప్రేమని మర్చిపోలేను. అరవై ఏళ్ల తర్వాత కూడా గత ఇరవై రోజుల్లో జరిగిన ఈవెంట్స్ అందమైన జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. అంత బలమైన జ్ఞాపకాలు నాకిచ్చారు. ఇప్పుడు నేను మీకు మంచి జ్ఞాపకం ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకునే సినిమా ఇస్తే నా పర్పస్ నేరవేరినట్లు. అందులో ఒక అడుగు లైగర్ అని బలంగా నమ్ముతున్నా.

పూరి, ఛార్మి గారు ఈ కథ చెప్పినపుడు నా మనసులో వచ్చిన మాట మెంటల్. ఈ సినిమాని ప్రేక్షకులకు త్వరగా చూపించేయాలనే ఎక్సయిట్ మెంట్. కానీ మూడేళ్ళు పట్టింది. ఇప్పుడు కేవలం ఐదు రోజులే మిగిలింది. నేను గ్యారెంటీ ఇస్తున్నా. లైగర్ కుమ్మేస్తుంది. మీరు నాకోసం ఒకటి చేయాలి. ఆగస్టు 25 గుంటూరుని షేక్ చేయాలి. ఈ వేదిక నుండి ఇండియాకి ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నా. ఆగస్టు 25 వాట్ లగా దేంగే'' అన్నారు.

https://youtube.com/shorts/N6h1DhRepSc

https://youtu.be/hYxAK3ne3oM

Advertisement
Author Image