For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies: విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ఒకరికొకరు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే: లైగర్‌ సినిమా

11:50 PM Nov 16, 2021 IST | Sowmya
Updated At - 11:50 PM Nov 16, 2021 IST
latest telugu movies  విజయ్ దేవరకొండ  మైక్ టైసన్ ఒకరికొకరు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే  లైగర్‌ సినిమా
Advertisement

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ పంచ్‌లోని పవర్ అందరికీ తెలిసిందే. అలాంటి మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నారు.

విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాకు వెళ్ళింది. నేడు అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌లు నవ్వుతూ కనిపించారు. కానీ ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ అని చెబితే మాత్రం సీన్ మారిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్‌ అంచనాలు మించేలా ఉంటాయి.

Advertisement GKSC

ఒకరికొకరు వారు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే.. ది లెజెండ్ వర్సెస్ లైగర్ ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు అంటూ చిత్రయూనిట్ తెలిపింది. మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మెమోరీస్‌గా గుర్తు పెట్టుకుంటున్నాను. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

లైగర్‌లో ఎంతో మంది విదేశీ ఫైటర్లు కూడా ఉన్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.

నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం:

దర్శకుడు : పూరి జగన్నాథ్
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్ : పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్ : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్ బాషా
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్ : కెచ్చా

Legend Mike Tyson, Liger Vijay Deverakonda Met Face To Face For USA Schedule,Ananya Pandey,Ramya Krishnan,Charmme Kaur,Puri Jagannadh,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image