For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన “అమీర్ ఖాన్”

10:55 PM Sep 19, 2021 IST | Sowmya
Updated At - 10:55 PM Sep 19, 2021 IST
green india challenge  బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన “అమీర్ ఖాన్”
Advertisement

కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఇవ్వాల బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ ను చేరింది.

ఇవ్వాల హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు.

Advertisement GKSC

Versatile Actor Amir Khan Participated in Green India Challenge,Hero Nagachaitanya,Joginapally Santosh Kumar MP,Lal Singh Chadda Movie,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comఅనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Versatile Actor Amir Khan Participated in Green India Challenge,Hero Nagachaitanya,Joginapally Santosh Kumar MP,Lal Singh Chadda Movie,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com

Versatile Actor Amir Khan Participated in Green India Challenge,Hero Nagachaitanya,Joginapally Santosh Kumar MP,Lal Singh Chadda Movie,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com

Advertisement
Author Image