Tollywood News: విక్టరి వెంకటేష్ విడుదల చేసిన నాగశౌర్య లక్ష్య ట్రైలర్
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరి వెంకటేష్ విడుదలచేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో...
నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం. మొదటగా సంతోష్ వచ్చి మూడు గంటలు కథ వినిపించారు. అప్పటికి ఇంటర్వెల్ అయింది. ఇక మిగతా కథ రేపు వింటాను అని అన్నాను. ఆయన ప్రతీ ఒక్క పాయింట్‌ను ఎంతో క్లియర్‌గా వివరించారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా వదలాలి అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను.
ఈ చిత్రంలో జగపతి బాబు గారు, సచిన్ ఖేద్కర్ గారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. నేను మోయలేని సమయంలో ఆ ఇద్దరూ వచ్చి నిలబెడతారు. ముగ్గురి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. కోహ్లీ గారికి కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని అన్నారు.