FILMNEWS: తొలి బాలీవుడ్ సినిమా "లాల్‌సింగ్ చద్దా"లో జాయిన్ అయిన యంగ్ హీరో "నాగచైతన్య"
Laal Singh Chaddha Movie, Hero Naga Chaitanya, Hero Aamir Khan, Kiran Rao, Advait Chandan, Latest Film News, Telugu World Now
FILMNEWS: తన తొలి బాలీవుడ్ సినిమా "లాల్‌సింగ్ చద్దా"లో జాయిన్ అయిన యంగ్ హీరో "నాగచైతన్య"
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’తో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్ ఫోటోను షేర్ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ కలసిఉన్నారు.
అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
