For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"కురుప్" సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమోనని భయపడ్డా: హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల

01:21 PM Nov 14, 2021 IST | Sowmya
Updated At - 01:21 PM Nov 14, 2021 IST
 కురుప్  సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమోనని భయపడ్డా  హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల
Advertisement

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా సినిమా రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రోహిత్ విడుదల చేశారు. చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

నేను పుట్టి పెరిగింది సంప్రాదయమైన తెలుగు కుటుంబంలో అయినా, నా సినీ ప్రస్థానం మొదలైంది మాత్రం ముంబైలోనే. కాబట్టి నా జర్నీకి స్టార్టింగ్ పాయింట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. నా మనసులో ఎలాంటి బౌండరీలు లేవు. నేను ఏ భాషలో సినిమా చేయాలన్నా కథ బాగా నచ్చాలి. అంతేకానీ ఇది మన భాష కాదనే విషయాన్ని నేను పట్టించుకోను. సినిమాలో నా పాత్ర నన్ను ఇంప్రెస్ చేస్తే ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ. ‘కురుప్’లో నా పాత్ర నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

Advertisement GKSC

తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను. తెలుగులో ఇతర భాషల హీరోయిన్లు వస్తున్న మాట నిజమే. కానీ తెలుగువాళ్లకు అవకాశాలు లేవని నేను చెప్పను. నాకు బయటకంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు కూడా మనలాగే అనుకుంటారేమో.

సినిమా రెండేళ్ల క్రితం పూర్తయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా ఇన్ని భాషల్లో ఇంత పెద్ద ఎత్తున విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘కురుప్’, ‘మేజర్’ సినిమాల తర్వాత మణితర్నం గారితో ‘పొన్నియన్ సెల్వణ్’ మూవీ చేస్తున్నా. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. ‘సితార’ అనే హిందీ సినిమాతో పాటు ‘మేడిన్ హెవన్’ సీజన్2లో కూడా చేస్తున్నా. ఇక నా తొలి హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాను. నేను నటించిన పలు సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నా.

Kurup is Very Happy With The Good Response Coming To The Film,Heroine Sobhita Dhulipala,Latest Malayalam Dubbing Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image