Entertainment : ప్రభాస్ను పెళ్లి చేసుకుంటా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్
Entertainment టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హీరో ప్రభాస్. అయితే డార్లింగ్ ఫలానా హీరోయిన్తో లేదా వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అందులో హీరోయిన్ కృతిసనన్ ఓకరు. అయితే తాజాగా ఇప్పుడీ న్యూస్కి హీరోయిన్ కృతిసనన్ ఇంకాస్త మసాలా యాడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. 'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో హీరోయిన్ కృతిసనన్.. హీరో ప్రభాస్పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు, క్లోజ్గా మూవ్ అయినట్లు కనిపించింది. కొన్నాళ్ల ముందు 'కాఫీ విత్ కరణ్' షోకి వచ్చిన కృతి.. ప్రభాస్కు ఫోన్ చేసి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చింది.
ఇది కాదన్నట్లు 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ఈవెంట్లోనూ ప్రభాస్-కృతిసనన్ జోడీ ఆకట్టుకుంది. ప్రభాస్ మోకాలికి సర్జరీ కావడంతో ఆరోజు సరిగ్గా నిలబడలేకపోయాడు, నడవలేకపోయాడు. దీంతో కృతి.. తన చేయి అందించి సాయం చేసింది. ప్రభాస్ కు చెమటలు పడుతుంటే.. తన చీర కొంగు అందించింది. అలానే ప్రభాస్ ని తినేసేలా కృతిసనన్ కొంటెచూపులు చూస్తూ కనిపించింది. ఆ వీడియోలన్నీ అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా భేడియా(తెలుగులో తోడేలు) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి.. ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొంటోంది.
ఈ మూవీ ప్రచారంలోనూ ప్రభాస్ పేరు, పదేపదే ప్రస్తావన వచ్చింది. కృతిసనన్ గురించి చెబుతూ, ఆమె జీవితంలోకి డార్లింగ్ వచ్చాడని హీరో వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కృతిసనన్ కి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరితో డేట్ చేస్తావ్ అని యాంకర్ మూడు ఆప్షన్ ఇవ్వగా.. కార్తీక్ ఆర్యన్తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ అని చెప్పి, ఛాన్స్ వస్తే ప్రభాస్ని పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నార్త్ వదిన కన్ఫర్మ్ అయిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.