For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"ఛలో" కంటే పెద్ద హిట్ అవ్వాలి: డైరెక్టర్ అనిల్ రావిపూడి

10:04 PM Mar 28, 2022 IST | Sowmya
Updated At - 10:04 PM Mar 28, 2022 IST
 ఛలో  కంటే పెద్ద హిట్ అవ్వాలి  డైరెక్టర్ అనిల్ రావిపూడి
Advertisement

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా షెర్లి సెటియా హీరోయిన్ గా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో అభిరుచి గల నిర్మాత ఉష మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రి౦ద విహారి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిధిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో అనిల్ రావిపూడి, బివియస్ రవి,  హీరో నాగ శౌర్య, హీరోయిన్ షెర్లి సెటియా, దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ, నిర్మాత ఉష మూల్పూరి పాల్గొన్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ఆర్ ఆర్ ఆర్ సినిమా తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాగే ఇండస్ట్రీలో సినిమాలు ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఐరా క్రియేషన్ బ్యానర్ అంటే సినిమాలు లవ్ చేస్తారు.. ఆ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ ని కూడా అంతే బాగా చూసుకుంటారు. సొంత కుటుంబ సబ్యుల్లా చూసుకుంటారు.. అది మంచి ఆలోచన. అదే కంటిన్యూ చేయాలి. మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు. తీస్తూనే వున్నారు. ఈ సినిమా కూడా చలో కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అనిష్ నాకు బాగా తెలుసు. మంచి టాలెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సాయి శ్రీరామ్ చక్కటి విజువల్స్ ఇచ్చాడు. సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శౌర్య ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. డెఫినెట్ గా శౌర్య ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి.. అన్నారు.

Advertisement GKSC

Krishna Vrinda Vihari should be a bigger hit than Chalo - Successful director Anil Ravipudi at the teaser launch,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1.jpg

Advertisement
Author Image