For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Alanati Ramachandradu : కృష్ణ వంశీ, మోక్ష 'అలనాటి రామచంద్రుడు' ఫస్ట్ లుక్

10:47 PM Sep 10, 2023 IST | Sowmya
Updated At - 10:47 PM Sep 10, 2023 IST
alanati ramachandradu   కృష్ణ వంశీ  మోక్ష  అలనాటి రామచంద్రుడు  ఫస్ట్ లుక్
Advertisement

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం  ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు.

మేకర్స్ ఈ రోజు అలనాటి రామచంద్రుడు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కృష్ణ వంశీ క్యాజువల్ అవుట్ ఫిట్స్ లో హ్యాండ్ సమ్ గా కనిపించగా, మోక్ష భరతనాట్యం చేస్తూ బ్యూటీఫుల్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాని ఆసక్తిని పెంచింది.

Advertisement GKSC

ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. హైనివా క్రియేషన్స్ బ్యానర్ లో మా మొదటి చిత్రంగా మీ ముందుకు వస్తున్నాం. అలనాటి రామచంద్రుడు సరికొత్త ప్రేమ కథా చిత్రం.  కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రం. దర్శకుడు ఆకాష్ రెడ్డి చిలుకూరి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఎన్నో అవార్డులు అందుకున్నారు. తన మొదటి చిత్రంగా "అలనాటి రామ చంద్రుడు పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రం మీ అందరికీ  నచ్చుతుంది అని నమ్ముతున్నాం’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. సరికొత్త ప్రేమకధాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఓ చిరుజల్లులా హాయిగా వుంటుంది. మీ అంధరికి నచ్చుతుంది’ అన్నారు.

ఈ చిత్రంలో  సీనియర్ నటుడు బ్రహ్మాజీ , సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును,  చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ సాగర్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జే సి శ్రీకర్ ఎడిటర్.

Advertisement
Author Image