For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

క్రేజీ అనౌన్స్ మెంట్! ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అమెరికాలో జూలై 20న, ఇండియాలో జూలై 21న

10:18 PM Jul 15, 2023 IST | Sowmya
Updated At - 10:18 PM Jul 15, 2023 IST
క్రేజీ అనౌన్స్ మెంట్  ప్రాజెక్ట్ k టైటిల్  గ్లింప్స్ అమెరికాలో జూలై 20న  ఇండియాలో జూలై 21న
Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ప్రాజెక్ట్ K అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమా, ఇండియన్ సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో అలరించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు.

ప్రాజెక్ట్ K శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అక్కడ జరిగే ఈవెంట్ లో భారత ప్రామాణిక కాలమానం( (IST) ప్రకారం జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ లు పిడికిలి షేక్ చేయడం కనిపిస్తోంది.

Advertisement GKSC

ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. 'ప్రాజెక్ట్ K' వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్ గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. చాలా మంది సూపర్‌స్టార్లు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ ను దేశం ఎన్నడూ చూడలేదు.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Author Image