For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Kotha Rangula Prapancham : 'కొత్త రంగుల ప్రపంచం' మూవీ జెన్యూన్ రివ్యూ

09:42 PM Jan 20, 2024 IST | Sowmya
Updated At - 09:42 PM Jan 20, 2024 IST
kotha rangula prapancham    కొత్త రంగుల ప్రపంచం  మూవీ జెన్యూన్ రివ్యూ
Advertisement

రేటింగ్: 3.5/5 

చిత్రం: కొత్త రంగుల ప్రపంచం
బ్యానర్: శ్రీ పీఆర్ క్రియేషన్స్
నటీనటులు: పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి తదితరులు
డైరెక్టర్: పృథ్వీరాజ్
నిర్మాత: దాసరి పద్మ రేఖ, కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: సంగీత్ ఆదిత్య
సినిమాటోగ్రఫి: S.V శివారెడ్డి
ఎడిటర్: రామకృష్ణ ఎర్రం
విడుదల: 20-01-2024

Advertisement GKSC

సినిమా ప్రేక్షకులను తనదైన కామెడీతో, మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. తన కూతురు శ్రీలును వెండితెరకు పరిచయం చేస్తూ శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్త రంగుల ప్రపంచ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మంచి అంచల నడుమ ఈ రోజు థియేటర్లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షిద్దాం.

సాంకేతిక విభాగం : మొదటిగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్పృథ్వీరాజ్ గురించి. ఇన్నాళ్లు ఆయనలో కామెడీ స్టార్ నే చేశాము కానీ ఇంత మంచి డైరెక్టర్ ఉన్నారు అనుకోలేదు. ప్రతీ సీన్ చాలా అద్భుతంగా చేశారు. చాలా సినిమాలు చేసిన అనుభవం తన డైరెక్షన్ లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రతీ సీన్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఔట్ పుట్ ఇవ్వడం అంటే అది ఆయన అనుభం మూలనే కావచ్చు. సినిమాటో గ్రాఫర్ ఎస్ వీ శివారెడ్డి చాలా చక్కగా చేశారు. అతనికి పనితనానికి ఎక్కడా వంక పెట్టాల్సిన పనిలేదు. ఎడిటర్ గా రామకృష్ణ ఎర్రం ఇంకాస్త తన కత్తెరకు పనిచేప్పాలి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంకాస్తా పరుగులు పెట్టిస్తే బాగుండు. తరువాత మ్యూజిక్ అందించిన సంగీత్ అదిత్య ఆకట్టుకున్నాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమా ఎక్కవ శాతం ఫామ్ హౌస్ లోనే జరుగుతుంది. అయినా తాము పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

నటీనటులు : ముఖ్యంగా హీరోయిని శ్రీలు ఫార్మార్మెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా సహజంగా కనిపించింది. సహజంగా కనిపించడమే కాదు చాలా ఈజీగా నటించింది. తన నటన చూస్తే ఇది కచ్చితంగా తన మొదటి సినిమా అంటే ఎవరు నమ్మరు అంత సునాయసంగా చేసింది. ఇక సెకండ్ క్యారెక్టర్ తలపులమ్మ వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇటు మోడర్న్ అమ్మాయిలా కూడా చాలా బాగా చేసింది. ఎలాగు రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మొదటి సినిమాకే చేసి మెప్పించడం అంటే మాములు విషయం కాదు. ఎలాగే తన బ్లడ్ లోనే నటన ఉంది కాబట్టి శ్రీలు నటించడం చాలా ఈజీ. తన కళ్లు, స్మైల్ కూడా చాలా బాగుంది. అలాగే హీరోగా చేసిన క్రాంతి కృష్ణ యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేసుకున్నాడు, అలాగే స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. తరువాత యాక్టర్ పృథ్వీ గురించి వేరే చెప్పేది ఏముంటుంది. ఎప్పటిలాగే అద్భుతంగా చేశారు. తలపులమ్మకు తండ్రి క్యారెక్టర్ చేసిన చౌదరి కూడా చాలా బాగా నటించారు. మిగితా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.kotha rangula prapancham movie review,Director Prudhviraj,Hero Kranthi Krishna,Heroine Sreelu Dasari,Film News,Latest Telugu Movies,Telugu World Nowకథ : పృథ్వీ సినిమా డైరెక్టర్. ఓ నిర్మాతకు కథ చెప్పి ఒప్పించి కాస్ట్ అండ్ క్రూతో కలిసి షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు బస్సులో వెళ్తాడు. హీరోయిన్ శ్రీలు, హీరో క్రాంతి కృష్ణ. ఫామ్ హౌస్ ను గురువయ్య అనే వ్యక్తి మేనజర్ గా ఉంటాడు. అక్కడే శ్రీలు ను చూసి తన తన కూతుర్ని గుర్తుకు చేసుకుంటాడు. షూటింగ్ చేస్తున్నవారికి ఆ ఇంట్లో ఏదో ఉంది అనే అనుమానం కలుగుతుంది. హీరోయిన్ శ్రీలు యాక్టింగ్ చేసినప్పుడు తనను ఎవరో ఆవహించినట్లు వింతగా ప్రవర్తిస్తుంది. మరో వైపు గురువయ్యకు ఒక గంజాయి స్మగ్లర్ తో డీల్ కుదుర్చుకుంటాడు అడ్డొచ్చిన పోలీసులను హతమారుస్తుంటాడు. ఇదిలా ఉంటే ఈ షూటింగ్ ప్రాసెస్ లో హీరో క్రాంతి కృష్ణ, శ్రీలు ప్రేమలో పడుతాడు. అది గురువయ్యకు నచ్చదు. ఈ పరిస్థితులను గమనించిన డైరెక్టర్ పృథ్వీ అసలు విషయం కనుకుందామని ఓ గురువు దగ్గరకు వెళ్తే ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఆత్మ ఉందని చెప్తుంది. ఆసలు ఆ ఆత్మ ఎవరిది? హీరోయిన్ శ్రీలునే ఎందుకు ఆవహిస్తుంది.? గంజాయి స్మగ్లింగ్ ను పట్టించడానికి క్రాంతి కృష్ణ ఏం చేశాడు? ఇంతకి క్రాంతి కృష్ణ బ్యాగ్రౌండ్ ఏంటి? గురువయ్య శ్రీలును ఎందుకు ప్రేమగా చూసుకుంటున్నాడు? అసలు తలపులమ్మ ఎవరు? తన కోరిక ఏంటీ? ఇన్ని చిక్కుల నడుమ పృథ్వీ సినిమా పూర్తి చేశాడా లేదా అనేది తెలియాలంటే కొత్త రంగుల ప్రపంచం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : సినిమా మొదలవడం మంచి థీమ్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్నో సార్లు తెలుగు తెరపై వర్కౌట్ అయిన ఫార్మెట్. ఒక ఇంట్లో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ వెళ్తుంది. అక్కడ ఒక ఆత్మ ఈ యూనిట్ కు ఎలా చుక్కలు చూపిస్తుంది. ఆద్యాంతం కామెడీతో చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీన్లలో ఆలోచింపజేసేలా ఉంటుంది. హీరో మార్నింగ్ షూటింగ్ చేసుకుంటూ, రాత్రిళ్లు దేనికోసమే వెతుకుతూ ఉంటాడు. దాన్ని సెకండ్ ఆఫ్ లో వివరిస్తారు. అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక తలపులమ్మ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ క్యారెక్టర్ ఎవరు అచ్చం హీరోయిన్ లా ఉంటుంది. వీరిద్దరికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ తెలిసినప్పుడు జస్టిఫై అవుతాయి. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చే హీరో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అలాగే గురువయ్య చెప్పె తలపులమ్మ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ కూడా అంతే డీసెంట్ గా ఉంది. కాస్త కామెడీ తగ్గింది అని పిస్తుంది. కానీ ఎమోషనల్ గా చాలా బాగుంది. ఇది కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన సినిమా. ఫుల్ ప్యాకెజ్ మూవీ అని చెప్పవచ్చు.

Advertisement
Author Image