Entertainment : కేఎల్ రాహుల్ తో అతీయా శెట్టి వివాహం ఎప్పుడంటే..
Entertainment భారత్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం త్వరలోనే జరగబోతుంది.. వీరిద్దరి పెళ్లి ఇరువైపు పెద్దల అంగీకారంతో వచ్చే నెలలో జరగబోతున్నట్టు సమాచారం.. గత మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్దరి వివాహం జనవరి 23న జరగనుంది.. అయితే వీరిద్దరి ప్రేమకు ఇరువైపు పెద్దలు అంగీకరించారని పెళ్లికి కూడా అన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది..
గత కొన్ని ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరి వివాహం సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో జనవరి 23 న జరగబోతున్నట్టు సమాచారం..
కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే మెగిసిన వన్డే సిరీస్లో పెద్దగా అలరించని రాహుల్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ నడిపించబోతున్నాడు అయితే ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గాయంతో స్వదేశానికి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే... ఈ ఏడాది గాయాల కారణంగా కేఎల్ రాహుల్ కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. ఫామ్ కోల్పోయిన కేఎల్ రాహుల్‌కి ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ 2022లో వరుసగా అవకాశాలు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి. దాదాపు ఏడేళ్ల క్రితం అతిశెట్టి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. సూరజ్ పంచోలి లీడ్ రోల్ పోషించిన ‘హీరో’ మూవీతో తెరంగేట్రం చేసిన అతియా శెట్టి.. తన నటనతో మెప్పించింది.. ఆ తర్వాత.. 2019లో రిలీజ్ అయిన ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది..