For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: సిటీలో సెక్యురిటీ గార్డ్, ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో "రాజ్ తరుణ్"

08:47 AM Nov 18, 2021 IST | Sowmya
Updated At - 08:47 AM Nov 18, 2021 IST
tollywood updates  సిటీలో సెక్యురిటీ గార్డ్  ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో  రాజ్ తరుణ్
Advertisement

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

‘రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 115 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో రాజ్ తరుణ్ పాత్రలోని రెండు కోణాలను చూపించారు. సిటీలో సెక్యురిటీ గార్డ్, ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో రాజ్ తరుణ్ మెప్పించారు. బంగారం గాడి లాంటి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటది.. పోతా ఉంటది.. ఏదీ పర్మనెంట్‌గా ఉండదు.. అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో పాత్ర స్వరూపం ఏంటో అర్థమవుతుంది. ఈచిత్రంలో కశిష్ ఖాన్ టెక్కిగా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతోందో చూపించేశారు.

Advertisement GKSC

నాగార్జున ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. ప్రతీ ఒక్క ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన వచ్చింది. నవంబర్ 26న అనుభవించు రాజా థియేటర్లోకి రాబోతోంది.

King Akkineni Nagarjuna Launched Trailer Of Raj Tarun, Sreenu Gavireddy, Annapurna Studios,Anubhavinchu Raja,Kashish Khan,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainmnets,www.teluguworldnow.comనటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా

సాంకేతిక బృందం:

రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం : గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి
సినిమాటోగ్రఫర్ : నాగేష్ బానెల్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
లిరిక్స్ : భాస్కర భట్ల
ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్
కొరియోగ్రఫర్ : విజయ్ బిన్నీ
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
క్యాస్టూమ్ డిజైనర్ : రజినీ.పి
కో డైరెక్టర్ : సంగమిత్ర గడ్డం
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image