For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఇటలీలో కొన్ని షాట్లు తీశాం, వాటిని చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది: చిత్ర‌ నిర్మాత కోనేరు సత్య నారాయణ

09:27 AM Feb 08, 2022 IST | Sowmya
Updated At - 09:27 AM Feb 08, 2022 IST
ఇటలీలో కొన్ని షాట్లు తీశాం  వాటిని చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది  చిత్ర‌ నిర్మాత కోనేరు సత్య నారాయణ
Advertisement

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.  డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటించారు.

నేను కథను నమ్ముతాను. రాక్షసుడు సినిమా కథను నమ్మాను. అది హిట్ అయింది. ఇందులో కథ బాగుంటుంది. హీరో హీరోయిన్లు కెమెరా ఇదంతా సెకండరీ. కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. మీ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్ట్ చేయాలని ఈ సినిమాను చేస్తున్నానని రవితేజ గారితో చెప్పాను.Khiladi will be a family-friendly film with commercial elements - Producer Koneru Satya Narayana interview,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఇలాంటి పాయింట్‌తో ఇది వరకు సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతోంది. బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది. సినిమా ఎంతో స్టైలీష్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉంటాయి.

Advertisement GKSC

నా సినిమా మీదు నాకు నమ్మకం ఉంది. సినిమా చూసి ఈ మాట చెబుతున్నాను. అవుట్ కమ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. రాక్షసుడు సినిమా చూసి ఎలాంటి ఫలితం వస్తుందని అనుకున్నానో ఇప్పుడు దాని కంటే ఎక్కువ రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాను.

ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. అయినా నైజంలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సోలో రిలీజ్‌గానే వస్తున్నాం. ఫిబ్రవరి 25వరకు ఇంకో పెద్ద సినిమా ఏదీ కూడా రాకపోవచ్చు. ఖిలాడీ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని నమ్ముతున్నాను.

సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో ఖిలాడి సినిమా విడుదల కానుంది.

Advertisement
Author Image