For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నకేరళ చిత్రం '2018'

10:05 AM May 25, 2023 IST | Sowmya
Updated At - 10:05 AM May 25, 2023 IST
ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నకేరళ చిత్రం  2018
Advertisement

ఒక భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయడం చాల పరిపాటి అయిపొయింది నేటి ట్రెండ్ లో . ఇక మన తెలుగు సినీ ప్రేక్షకులు అయితే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరించడం కొత్తేమీకాదు. కాంతారా అనే కన్నడ చిత్రాన్ని ఎంత పెద్ద విజయవంతం చేసారో అందరికి తెలిసిందే.

కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందిఅన్నా విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా mollywood యాక్టర్ తొనివో థామస్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమే "2018". ఇప్పటికే మలయాళం లో రిలీజ్ అయ్యి సెన్సషనల్ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 131 కోట్లు కొల్లగొట్టింది.

Advertisement GKSC

అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇపుడు అన్ని భాషల్లో విడుదల చేసేయందుకు సన్నాహాలు జరిగాయి. మన తెలుగు లో, సినిమా హక్కులని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గారు దక్కించుకున్నారు . ఆల్రెడీ తెలుగు రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నెల 26 న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ : సినిమా గొప్ప విజయం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. సినిమా చూడగానే తనకు నచ్చింది అని అందుకే తెలుగు లో విడుదల చేయాలనీ అనుకున్న అని మీడియా తో చెప్పారు.

అలాగే చిత్ర దర్శకుడు జూడ్ అంతనీ జోసెఫ్ మాట్లాడుతూ... ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకం అని అన్నారు. చిత్రీకరణ సమయం లో ఏంటో మంది భాదితుల అనుభవాలని తెలుసుకొని సినిమా తెరకెక్కించాం అని అన్నారు.

నిర్మాత వేణు మాట్లాతూ.. తెలుగు ప్రేక్షకులు తమ సినిమాని సక్సెస్ చేస్తారు అని మీడియాతో ముచ్చటించారు. నిజ జీవిత ఆధారంగా తీసిన ఈ సినిమా అందరి మనస్సుకు చేరుతుందని అన్నారు.

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని వాస్తవాలను తెలియచేసే సినిమాలను సినీ ప్రేమికులు ఎపుడూ ఆదరిస్తూనే ఉంటారని మీడియా పాత్రికేయులతో అన్నారు.

ఈరోజు జరిగిన ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ అందుకుంది. ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాత బన్నీ వాసు గారు తన ఆనందాన్ని మీడియా తో పంచుకున్నారు. తొనివో థామస్ తోపాటు కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు. తెలుగు తో పటు తమిళ, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement
Author Image