For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు "సిబిరాజ్" హీరోగా “మాయోన్” చిత్రం జూలై 7న

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు  సిబిరాజ్  హీరోగా “మాయోన్” చిత్రం జూలై 7న
Advertisement

కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందు కు చాలా సంతోషంగా ఉంది. గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది . ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్‌లను సూచించ లేదు. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభించింది.హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రముఖ కెమెరామ్యాన్‌ రాంప్రసాద్ “మాయోన్” చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు.ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్త్ ఉంటుంది. “మాయోన్” చిత్రాన్ని జూలై 7 న తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అన్నారు.

Advertisement GKSC

చిత్ర హీరో శిబిరాజ్ మాట్లాడుతూ... ఆద్యంతం ఉత్కంఠభరితంగా రూపొందిన “మాయోన్” తెలుగు ప్రేక్షకులకు విజువల్ వండర్గా ఉంటుందని, అందరినీ తప్పకుండా అలరిస్తుందని అన్నారు.Kattappa Sathyarajs son Sibiraj plays the hero The prestigious Mayon movie will have a grand release on July 7.Tanya Ravichandran,Telugu Golden TV, My Mix Entertainments,www.teluguworldnow.com నటీ నటులు: సిబిరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు

సాంకేతిక నిపుణులు: దర్శకత్వం : కిషోర్ ఎన్, నిర్మాత : మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం, పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Advertisement
Author Image