For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS : TNR జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ "కర్ణ" థీమ్ సాంగ్ లాంచ్ చేశారు

05:06 PM Jan 10, 2022 IST | Sowmya
Updated At - 05:06 PM Jan 10, 2022 IST
film news   tnr జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ  రుత్విక్  కర్ణ  థీమ్ సాంగ్ లాంచ్ చేశారు
Advertisement

టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ చిత్రానికి అన్నీ తానై పని చూసుకుంటున్నారు కళాధర్ కొక్కొండ. ఆయనే స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే చేయడం విశేషం. ఈ సినిమాకు ప్రశాంత్ BJ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు TNR జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ప్రశాంత్ BJ అందించిన మ్యూజిక్ పాటలో వస్తున్న సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఈ పాటలో చూపించిన సన్నివేశాలతో ఈ మూవీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని తెలుస్తోంది.

Advertisement GKSC

''భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు'' అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా సాగిపోతున్న ఈ పాటలో ప్రతి సన్నివేశం డైరెక్టర్ ప్రతిభను బయటపెడుతోంది. ఈ 'కర్ణ' సినిమాలో హీరో కళాధర్ కొక్కొండ రోల్ ఎంత బలంగా ఉండనుందో ఈ థీమ్ సాంగ్ వెల్లడిస్తోంది. హీరో డిఫరెంట్ లుక్ సినిమాకు మరో అసెట్ కానుందని తెలుస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్ కానుంది. Karna theme song Released by On The Ocation Of TNR Birthday With his Childrens, Releasing on January 28th,hero kaladhar,New Telugu Moives,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com..1కాస్ట్: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, అస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
నిర్మాత: కళాధర్ కొక్కొండ
బ్యానర్: సనాతన క్రియేషన్స్
మ్యూజిక్: ప్రశాంత్ BJ
DOP: శ్రవణ్ G కుమార్
ఆడియో: మధుర ఆడియో
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Advertisement
Author Image