Entertainment : వాళ్ళ అమ్మతో నా భర్త నన్ను కొట్టించేవాడు.. కరిష్మా కపూర్..
Entertainment బాలీవుడ్ లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి కరిష్మా కపూర్.. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన ఈమె జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి అంటూ తాజాగా చెప్పకు వచ్చింది..
కరిష్మా కపూర్ సినిమాల పరంగా తనకంటూ ఒక వెలుగు వెలిగిన భామ అయితే 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను పెళ్లి చేసుకుంది అయితే కొన్నాళ్లు సవ్యంగా ఉన్న వీరు మధ్య తర్వాత మాత్రం మన విషయాల్లో గొడవలు వచ్చాయి అయితే ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవలు పడి తన భర్త అత్తలపై వరకట్న వేధింపుల కేసు పెట్టే సాయి వరకు వెళ్ళింది అయితే తాజాగా ఈ విషయంపై మరొకసారి స్పందించింది ఈ భామ..
తాజాగా ఈ విషయంపై మాట్లాడిన కరిష్మా.. 'సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. నా కొడుకు కియాన్ పుట్టిన తర్వాత దాన్ని నన్నోసారి వేసుకోమన్నారు. తల్లినయ్యాక నా శరీరం కొద్దిగా లావైంది. ఆ డ్రెస్ నాకు పట్టలేదు. అది చూసిన సంజయ్ కోపంతో నన్ను లాగి కొట్టమని అతడి తల్లికి చెప్పాడు. అతడి ప్రవర్తనను తప్పు పట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుక్కే సపోర్ట్ చేసింది.. ' అని చెప్పకు వచ్చింది అలాగే ఇలాంటి ఎన్నో సంఘటనలు జీవితంలో ఎదుర్కొన్నాను అంటూ అందుకే అతనితో విడాకులు తీసుకున్నానంటూ తెలిపింది.. వీరిద్దరూ 2016లో విడాకులు తీసుకోగా పిల్లలిద్దరి బాధ్యతను కోర్టు కరిష్మా కపూర్ కు అప్పగించింది