FILM NEWS: రాధికా కుమారస్వామి సమర్పణలో 'లక్కీ స్టార్'గా వస్తున్న కన్నడ రాక్ స్టార్ యష్
KGF Movie Kannada Rock Star Yash, Lucky Star Movie, Heroine Ramya, Latest Telugu Movies, FILM News, Telugu World Now,
FILM NEWS: రాధికా కుమారస్వామి సమర్పణలో 'లక్కీ స్టార్'గా వస్తున్న కన్నడ రాక్ స్టార్ యష్
కె.జి.ఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు గడించుకున్న యష్ నటించగా... కన్నడలో ఘన విజయం సాధించిన "లక్కీ" అనే చిత్రం తెలుగులో "లక్కీ స్టార్"గా వచ్చేందుకు ముస్తాబవుతోంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు "లక్కీ స్టార్" చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది.
నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ... "కన్నడలో యష్ కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో "లక్కీ" ఒకటి. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, "రాబర్ట్' ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. సీనియర్ రైటర్ గురుచరణ్ తెలుగులో మాటలతోపాటు పాటలు కూడా రాశారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అనువాద కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో: ధీరజ్-అప్పాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: కేశవ్ గౌడ్, కూర్పు: దీపు ఎస్. కుమార్, ఛాయాగ్రహణం: కృష్ణ, సంగీతం: అర్జున్ జన్య (రాబర్ట్ ఫేమ్), బ్యానర్: శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్, సమర్పణ: రాధికా కుమారస్వామి, నిర్మాత: రవిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ సూరి!!