Entertainment : డబ్బు కోసం పెళ్లిలో డాన్స్ చేయలేదు.. కంగనా రనౌత్..
Entertainment భారతదేశ గొప్ప సింగర్లలో ఒకరైన ఆశాభోంస్లే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే అయితే ఆమెకు సంబంధించి ఒక క్లిప్పు తాజాగా వైరల్ గా మారింది అయితే ఈ విషయంపై స్పందించింది బాలీవుడ్ క్వీన్ కంగనా...
లెజెండ్రీ సింగర్ ఆశాభోంస్లేకు సంబంధించి ఒక క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ఆమె తనకు పెళ్లిలో పాడేందుకు ఎంతో డబ్బు ఇవ్వాలని చూసిన అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది అలాగే భారతదేశం గొప్ప సింగారులలో ఒకరైన ఆమెకు ఒక పెళ్లిలో పాడేందుకు ఐదు మిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పారంట అయినప్పటికీ ఆమె ఈ విషయానికి ఒప్పుకోలేదని తెలిపారు అయితే ఈ విషయంపై స్పందించిన కంగనా తాజాగా వైరల్ కామెంట్స్ చేసింది..
‘మీరు చెప్పిన మాటలకు అంగీకరిస్తున్నాను. నేను కూడా పెళ్లిళ్లు లేదా ప్రైవేట్ పార్టీల్లో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. నా సినిమాల్లో మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఉన్నప్పటికీ, భారీ అమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించాను. ప్రస్తుతం ఈ వీడియో చూసినందుకు సంతోషిస్తున్నాను.. లతాజీ మీరు నిజంగా ఇన్‌స్పైర్ చేశారు’ అని పేర్కొంది..
ప్రస్తుతం కంగన తన స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తుండగా.. షూటింగ్ పిక్స్, వీడియోలను రెగ్యులర్‌గా షేర్ చేస్తోంది. ఇందులో డ్రామాలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, భూమిక చావ్లా నటిస్తున్నారు..