For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : అంత సీన్ లేదంటూ జ్యోతిక పై కంగనా వైరల్ కామెంట్స్..

07:17 PM Feb 16, 2023 IST | Sowmya
Updated At - 07:17 PM Feb 16, 2023 IST
entertainment   అంత సీన్ లేదంటూ జ్యోతిక పై కంగనా వైరల్ కామెంట్స్
Advertisement

Entertainment బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్టార్ హీరోయిన్ కంగనా రనోత్ ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈమె సీనియర్ యాక్టర్ లను స్టార్ హీరోలను టార్గెట్ చేయడంలో ముందుంటారు. దాదాపు అందరూ బాలీవుడ్ హీరోలను ఈమె ఇప్పటివరకు టార్గెట్ చేసేసారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగానే వారిపైన విమర్శల వర్షం కురిపించేశారు. అయితే తాజాగా హీరోయిన్ జ్యోతిక పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనాథ్ ఎప్పుడు ఎవరో ఒకరిని విమర్శిస్తూనే వస్తూ ఉంటారు. కానీ ఈమె మొదటిసారిగా ఒక హీరోయిన్ ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాకుండా ఆమెలో ఉన్న టాలెంట్ను గుర్తించి పొగడ్తల వర్షం కురిపించేశారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ జ్యోతిక.. అసలు విషయం ఏంటంటే చంద్రముఖి 2 సినిమాలో ప్రస్తుతం కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కంగనా. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిక అద్భుతమైన నటి అని చెప్పుకొచ్చారు. అలాగే ఆమెకు దీటుగా నటించడం తన వల్ల కాదని అన్నారు. సినిమా చూసినప్పుడు కూడా జ్యోతిక తో కంపేర్ చేస్తూ చూడవద్దని అలా చూస్తే తన నటన అసలు నటనగానే కనిపించదని చెప్పుకొచ్చారు. అలాగే జ్యోతికలా నటించే అంత సీన్ తనకు లేదంటూ చెప్పేశారు.. ప్రస్తుతం కంగనా మాటలు వైరల్ గా మారాయి. చంద్రముఖి 2 సినిమాలో మొదటగా జ్యోతిక నటించటానికి అడిగారంట దర్శకుడు పి వాసు.. కానీ ఈ అవకాశాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు అంట. ఆ తర్వాత కంగనా ఈ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు ఇందులో రాఘవ లారెన్స్ వడివేలు వంటి వారు మిగిలిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే..

Advertisement GKSC

Advertisement
Author Image