For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'కల్కి 2898 AD' ఎందుకు మోస్ట్ యాంబిసియస్ మస్ట్ వాచ్ ఫిల్మ్ అఫ్ ది ఇయర్

10:28 PM Jun 21, 2024 IST | Sowmya
Updated At - 10:28 PM Jun 21, 2024 IST
 కల్కి 2898 ad  ఎందుకు మోస్ట్ యాంబిసియస్ మస్ట్ వాచ్ ఫిల్మ్ అఫ్ ది ఇయర్
Advertisement

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫస్ట్ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్ తో గ్లోబల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ భారతీయ పురాణాలలో రూట్ అయిన 'కల్కి 2898 AD' సినిమాటిక్ యూనివర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తే, తాజా ట్రైలర్ ఇంకా డీప్ గా ఎపిక్ నెరేటివ్ ని మహా అద్భుతంగా చూపింది.

ట్రైలర్ వారి అద్భుతమైన అవతారాలలో లార్జర్ దెన్ లైఫ్ హీరోలను ప్రజెంట్ చేసింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'అశ్వత్థామ'గా డేరింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ 'యాస్కిన్'గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించారు. 'బుజ్జి'తో కలిసి ప్రభాస్ 'భైరవ'గా బౌంటీ హంట్ లో అదరగొట్టారు. దీపికా పదుకొణె 'సుమతి' పాత్రను పోషించింది, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన పాత్రలో ఇంటెన్స్ ఛాలెంజస్ ని ఎదుర్కొంటుంది. దిశా పటానీ 'రాక్సీ'గా పవర్ ఫుల్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకుంది.

Advertisement GKSC

ట్రైలర్ కల్కి 2898 ADలోని మూడు డిఫరెంట్ వరల్డ్స్ ని పరిచయం చేసింది. కాశీ, మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం; కాంప్లెక్స్, ఉన్నత వర్గాలచే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం; మూడోది శంబాలా, కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి. అవుట్ స్టాండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టాప్ క్లాస్ VFX , బ్రీత్ టేకింగ్ విజువల్స్‌తో ఈ మూవీ ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ తో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.

'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీ అప్రోచ్, అద్భుతమైన విజువల్స్, స్టొరీ టెల్లింగ్ తో ఇండియన్ సినిమాని రిడిఫైన్ చేయగలదని ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్ లో మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ స్టాండ్ అవుట్ మూమెంట్ గా నిలిచింది. 'కల్కి 2898 AD' ట్రూలీ పాన్-ఇండియన్ మూవీ, దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ట్యాలెంటెన్స్ ని ఒకచోట చేర్చింది. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ మూవీ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisement
Author Image