Entertainment :నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది నీల్.. కాజల్ అగర్వాల్
Entertainment టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని వెంటనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ బాబు ఆరు నెలలు పూర్తి చేసుకోవడంతో ఒక ఎమోషనల్ పోస్టును ఇంస్టాగ్రామ్ లో ఉంచింది.. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని.. ఈ ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.. జూన్ 19న పుట్టిన ఈ బాబుకు నీల్ కిచ్లు అంటూ నామకరణం చేశారు.. అయితే నిన్నటికి ఈ బాబుకి ఆరు నెలలు నిండాయి.. ఈ సందర్భంగా కొడుకుపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తు ఓ ఫొటోను ఉంచింది.. ఇందులో ఈ బుడ్డోడు నుదుటిపై చేతులు వేసుకొని చిరునవ్వులు చిందుస్తూ ముద్దుగా ఉన్నాడు.
"గత ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియనే లేదు. యవ్వనంలో ఉన్నప్పుడు ఓ తల్లిగా నా కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తానా లేదా అన్న అనుమానం, భయం నాలో ఉండేది. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంత బిజీగా ఉనప్పటికీ నీ కోసం సమయం కేటాయిస్తాను. నీపై ఎప్పుడు అశ్రద్ధ చూపించను. రాత్రుల్లో నువ్వు అటూ ఇటూ దొర్లడం, నేలపై పాకడం చూసి ఎంతో సంతోషపడుతున్నాను. నీ జీవితంలో తొలిసారి జరిగే ప్రతి మూమెంట్ ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. నేను, మీ డాడీ కలిసి నీ కాలేజ్ రోజులను తలుచుకుంటూ నవ్వుకుంటున్నాం. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ అంటుంటారు.. ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు పుట్టి ఏడాది అవ్వడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్ మై బేబీ నీల్" అంటూ కాజల్ ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

