For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "మనిషి వేసుకున్న మరో వేషం మోసం" *K-3* (కీర్తి కాంత-కనకం) పాట విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ!!

06:55 AM Sep 04, 2021 IST | Sowmya
Updated At - 06:55 AM Sep 04, 2021 IST
film news   మనిషి వేసుకున్న మరో వేషం మోసం   k 3   కీర్తి కాంత కనకం  పాట విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
Advertisement

K3 Keerthi Kantha Kanakam Movie Song Released by Thammareddy Bharadwaj, Tollywood News Latest Telugu News, Telugu World Now,

FILM NEWS: "మనిషి వేసుకున్న మరో వేషం మోసం" *K-3* (కీర్తి కాంత-కనకం) పాట విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ!!

Advertisement GKSC

ఈ ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్ కి... "కీర్తి-కాంత-కనకం"లో ఏదో ఒకటి కారణంగా నిలుస్తుందనే వాస్తవాన్ని కథాoశంగా తీసుకుని... సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ "కె.3". (కీర్తి-కాంత-కనకం).

'మగువ' ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి (ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న "K-3" (కీర్తి-కాంత-కనకం) ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.

K3 Keerthi Kantha Kanakam Movie Song Released by Thmmareddy Bharadwaj, Tollywood News Latest Telugu News, Telugu World Now,ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని "మనిషి వేసుకున్న మరో వేషం మోసం" అనే పాటను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫిల్మ్ ఛాంబర్ లో ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. చిన్నికృష్ణ స్వరసారథ్యంలో రూపొందిన ఈ గీతాన్ని రవి మాదగోని రాయగా... ధనుంజయ్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వి.సముద్ర, చిత్ర నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి, దర్శకుడు ఆదిత్య వంశీ, గీత రచయిత రవి మాదగోని పాల్గొన్నారు.

K3 Keerthi Kantha Kanakam Movie Song Released by Thmmareddy Bharadwaj, Tollywood News Latest Telugu News, Telugu World Now,నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... "కాన్సెప్ట్ బేస్డ్ మూవీ "కె-3". కథే హీరో అండ్ విలన్. ఆదిత్య వంశీ ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా... ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాడు. సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఆదిత్య వంశీ దర్శకత్వం, చిన్నికృష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని (మిణుగురులు ఫేమ్) ఛాయాగ్రహణం, ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ "కె-3" చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కాబట్టి "కె-3" చిత్రాన్ని కచ్చితం ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఈ చిత్రంలోని పాటను విడుదల చేసి, మమ్మల్ని అభినందించిన తమ్మారెడ్డిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు" అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఫైట్స్: మల్లి మాస్టర్, పాటలు: రవి మాదగోని, సింగర్స్: ధనంజయ్-రచిత రాయప్రోలు, సంగీతం: చిన్నికృష్ణ, ఎడిటింగ్: సునీల్, సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, నిర్మాత: రొక్కం భాస్కర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఆదిత్య వంశీ!!

Advertisement
Author Image