Jr Ntr : సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్..!
Jr Ntr : దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఈ క్రేజ్ తో చేతి నిండా సినిమాలతో ఒక రేంజ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.
కాగా ఎన్టీఆర్ 30వ చిత్రం మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. వసుంధర ఆర్ట్స్, ఎన్టీఅర్ ఆర్ట్స్ కలబోసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించనుండగా... రత్నవేలు కెమెరా మెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా పట్టాలెక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేసేందుకు కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తారక్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ యాడ్‌లో ఆయన లుక్ ఎలా ఉండబోతుందో మనకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఆయన ఎప్పుడూ కనిపించే హెయిర్ స్టయిల్‌లో కాకుండా సరికొత్త లుక్‌తో కనిపించడంతో ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాద్ షా మూవీ లో ఉన్నట్లు ట్రెండీ గా ఈ లుక్ ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.