For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

జోరుగా హుషారుగా చిత్ర ఫస్ట్లుక్ ఆవిష్కరించిన సాయికుమార్

03:34 PM Mar 13, 2022 IST | Sowmya
Updated At - 03:34 PM Mar 13, 2022 IST
జోరుగా హుషారుగా చిత్ర ఫస్ట్లుక్ ఆవిష్కరించిన సాయికుమార్
Advertisement

విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం `జోరుగా హుషారుగా`. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్ పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. అను ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి ప్రచార చిత్రం ఆవిష్కరణ శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ `జోరుగా హుషారుగా` చిత్ర ఫస్ట్లుక్ను  ఆవిష్కరించారు.

అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ... టైటిల్ కు తగినట్లుగా హుషారైన టీమ్తో పని చేశాను. ఎస్.ఆర్. కళ్యాణమండపం చేశాక కొత్త దర్శకులు భిన్నంగా ఆలోచిస్తూ పాత్రలు ఇస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు. విరాజ్ను ఓటీటీలో చూశాక బాగా చేశాడనిపించింది. తను మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు అని తెలిశాక ఆనందం కలిగింది. రోహిణి నా భార్యగా నటించింది. మధునందన్ చక్కటి పాత్ర చేశాడు. ప్రణీత్ చేసిన పాటలు విన్నాను, చాలా బాగున్నాయి.Joruga Husharuga Movie First Look Launched by Saikumar,Viraj Ashwin, Poojitha Ponnada,Director Anu Prasad,telugu golden tv, my mix entertainments, teluguworldnow.comదర్శకుడు అనుప్రసాద్ తెలుపుతూ... ఇది నా తొలి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం.  సంగీత దర్శకుడు ప్రణీత్ ద్వారా కథను నిర్మాతకు వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది.. నేను అనుకున్నది అనుకున్నట్లు వచ్చేలా నిర్మాత సహకరించారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుపుకుంటోంది.

Advertisement GKSC

Advertisement
Author Image