జాతీయ రహదారి ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం -RGV
Jateeya Rahadari Movie Trailer Launch by RGV, Latest Telugu Movies, Telugu World Now,
జాతీయ రహదారి ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం-RGV
దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది కి అలాగే ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.
ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని ఒకసారి పిలువు అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది కి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు గారికి రుణపడి వుంటాను అని మాట్లాడారు.ఈ నెల 10 వతేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల అవుతుంది..అని అన్నారు.
డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ నేను ఎప్పుడు ఆర్.జి.వి గారిని కలుస్తానా అని అనుకునే వాడిని అది ఈ జాతీయ రహదారి వల్ల తీరింది, ఆయన శివ సినిమా చూసి చెన్నై కి ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను ఒకడిని,RGV గారు ఎప్పుడు ఎవరిని మెచ్చుకోరు అలాంటిది మా ట్రైలర్ చూసి మా జాతీయ రహదారి ట్రైలర్ బావుంది అని మెచ్చుకున్నందుకు..రేలీజ్ చేసి నందుకు ధన్యవాదములు అని చెప్పారు.
[
నటి నటులు:
మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి
సాంకెతిక వర్గం :
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :;- మౌన శ్రీ మల్లిక్,
ఎడీటర్ :; వి నాగిరెడ్డి,
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,
రచన దర్శ కత్వం :; నరసింహ నంది...
సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్