For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Political : జార్ఖండ్ లో రిజర్వేషన్ కోటా 77 శాతానికి పెంపు.. ఈ విషయంపై రాజ్యాంగం ఏం అంటుందంటే..

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
political   జార్ఖండ్ లో రిజర్వేషన్ కోటా 77 శాతానికి పెంపు   ఈ విషయంపై రాజ్యాంగం ఏం అంటుందంటే
Advertisement

Political జార్ఖండ్ ప్రభుత్వం రిజర్వేషన్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ ఓ బిల్లును ఆమోదించింది.. అలాగే ప్రజల నివాస స్థితికి సంబంధించిన ఓ ముఖ్యమైన బిల్లును కూడా తాజాగా ప్రభుత్వం ఆమోదించింది.

2001లో ఆమోదించిన రిజర్వేషన్ చట్టంలో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 60శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఓ బిల్లును పాస్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ రిజర్వేషన్ను ఇంకో 17 శాతం పెంచుతూ బిల్లును ఆమోదించింది.. అయితే ఈ విషయంపై రాజ్యాంగంలో కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే అని రాసి ఉంది.. రిజర్వేషన్లు యాభై శాతం దాటి అమలు చేయాలనుకుంటే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది. అలా చేర్చకుండా ఈ రిజర్వేషన్లను పెంచడం చేయరాదు.. అయితే ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జార్ఖండ్ ప్రభుత్వం కోరనున్నట్టు కూడా ఇందులో పేర్కొన్నారు..

Advertisement GKSC

అయితే ప్రస్తుతం ఝార్ఖండ్​లో ఎస్​టీలకు 26శాతం, ఎస్​సీలకు 10శాతం రిజర్వేషన్ ఉంది. ఓబీసీల కోటా 14శాతంగా ఉండగా.. ఈ రిజర్వేషన్లను కచ్చితంగా పెంచుతామని 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రజలకు మాట ఇచ్చాయి.. ఈ బిల్లుతో ఎస్సీలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, ఈబీసీలకు 15 శాతం, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది. అలాగే ప్రజల నివాస స్థితిని నిర్ణయించేందుకు 1932 భూ రికార్డ్ లనే ఉపయోగించాలని ఓ బిల్లును ఆమోదించింది..

Advertisement
Author Image