Entertainment : కెరీర్ లో దారుణమైన విమర్శలు ఎదుర్కొన్న.. జాన్వీ కపూర్
Entertainment బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీ లోకి స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాను సినిమాలోకి రావడం అంత తేలికగా జరగలేదని ఎన్నో అవమానాలు ఎదుర్కొని వచ్చానని చెప్పుకొచ్చింది..
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ కిడ్ ఐనప్పటికీ పువ్వుల బాట కాదని తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎందరో విపరీతంగా ట్రోల్ చేసే వారిని చెప్పుకొచ్చింది..
జాన్వి కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఎన్నో విషయాలు పంచుకుంది. అలాగే ఈ సందర్భంగా...నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నన్ను అందరు నెపోకిడ్ అని విమర్శించారు. నా మూవీ రిలీజ్ అయిన ప్రతీసారి నెపోకిడ్.. యాక్టింగ్ రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావ్.. అందాలు ఆరబోస్తే స్టార్ హీరోయిన్ అయిపోరు అంటూ ఎందరో ఎన్నో కామెంట్స్ తీసుకొచ్చారు. అలాగే ప్రతి విషయంలో నన్ను విమర్శిస్తూనే వచ్చారు. మరికొందరు ఇంకాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసి మనసుని బాధ పెట్టారు. అవన్నీ తలుచుకుంటే ఎంతో బాధగా అనిపించేది.. అలాగే అందరూ నాలో ఉన్న టాలెంట్ ను చూడకుండా కేవలం నెపోకిడ్ అని మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే తర్వాత అన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టి విమర్శలు పట్టించుకోవడం మానేశా. నాలో ఉన్న బలాలు బలహీనతలు నాకు పూర్తిగా తెలుసు. అందుకే వాటిపైన ఏకాగ్రత పెట్టి జీవితాన్ని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న అంటూ చెప్పుకొచ్చింది.