Political : తెలంగాణలో జనసేన పార్టీ కసరత్తులు..
Political జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తమ పార్టీ తెలంగాణలో పోటీ చేయబోతున్న సంగతి తెలిపిన సంగతి తెలిసిందే.. అలాగే రాబోయే ఎన్నికల్లో అక్కడ పోటీ చేసేందుకు ఇప్పటినుంచి కసరత్తులు ప్రారంభమయ్యాయి అని సమాచారం వినిపిస్తుంది..
రాబోయే తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. అలాగే రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలిపిన సంగతి తెలిసిందే... అలాగే తెలంగాణలో ఎన్ని స్థానాల్లో తమ పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని దీనిపై పూర్తిగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.. మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.. అయితే మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే మరి ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతము అందరూ చర్చించుకుంటున్నారు.. అలాగే రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా లేక ఆంధ్రాలో పోటీ చేయకుండా వెనక్కి తగ్గుతారా అనే విషయం తెలియాల్సి ఉంది
"జనసేనా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తాము.. " అని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలు అందరూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు... ఈ మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.