Political : ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన..
Political వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సంద్భంగా సీఎం కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ వెళ్తున్నారు. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నరాన్నరు.. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచామని తెలిపారు..అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారని.. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారనీ... వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారనీ తెలిపారు.. క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. దీంతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నామని తెలిపారు.. వచ్చే ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో అన్ని సిద్ధమవుతున్నాయని మళ్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.. అలాగే విజయవాడలో బీసీ మహాసభ సందర్భంగా మిగిలిన నేతలు అందరూ వైసిపి విజయం కోసం పాటుపడాలని మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని తప్పకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు..