For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : రన్వీర్ ను చెంప దెబ్బ కొట్టిన జాక్వెలిన్..

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
entertainment   రన్వీర్ ను చెంప దెబ్బ కొట్టిన జాక్వెలిన్
Advertisement

Entertainment బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ ఎక్కడ కనిపించినా చాలా యాక్టివ్ గా ఉంటారు అంతేకాకుండా పబ్లిక్ ఫంక్షన్స్ లో తన డిఫరెంట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు ఎంతో కూల్ గా కనిపించే ఈ హీరో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచేటట్టు ప్రవర్తిస్తాడు.. తాజాగా ఇతనికి ఓ చేదు అనుభవం ఎదురయింది..

ప్రస్తుతం ‘సర్కస్’ మూవీలో నటిస్తున్న రన్వీర్ సింగ్ తో జాక్వెలిన్ హీరోయిన్గా కనిపించనుంది.. అలాగే ఇందులో మరో కోస్టార్ వరుణ్ శర్మ కూడా నటిస్తున్నారు అయితే వీరిద్దరిని తాజాగా జాక్వెల్లి చంప దెబ్బ కొట్టాల్సి వచ్చింది.. ఇందుకు గల కారణం ఏంటో వివరించింది ఈ బ్యూటీ

Advertisement GKSC

తాజాగా ఈ షూటింగ్ కోసం మాట్లాడిన జాక్వెలిన్.. ‘ఫస్ట్ డే షూట్‌లో భయపడ్డాను. ఎందుకంటే షాట్‌లో భాగంగా వరుణ్, రణవీర్‌ను చెంపదెబ్బ కొట్టాలి. కానీ నేను వారిని నిజంగానే లాగిపెట్టి కొట్టాను. దీంతో చాల భయపడిపోయాను. కానీ షాట్ అయిపోయాక వరుణ్, రణ్‌వీర్ సరదాగా స్పందించారు. నేనైతే చాలా భయపడ్డాను కానీ నా భయం అంతా పోగోడుతూ ‘నా దవడ పగిలిపోయింది. ఐస్ కావాలి’ అని రణవీర్ బదులిచ్చినట్లు తెలిపింది.. అయితే ఈ సంఘటనతో తనకు ఎంతో భయమేసింది అని మీరు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడిన తర్వాత మామూలు అవటానికి చాలా సమయం పట్టింది అంటూ చెప్పకు వచ్చింది ఈ హీరోయిన్.. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదలకు కూడా సిద్ధమవుతుంది

Advertisement
Author Image