For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: పిచ్ఛ పిచ్చగా నచ్చేసే *పీప్ షో* ఆటో రాంప్రసాద్ అదరగొట్టేసాడు -"పీప్ షో" పోస్టర్ లాంచ్ ఫంక్షన్ లో సుడిగాలి సుధీర్-హైపర్ ఆది-గెటప్ శ్రీను

03:44 PM Sep 06, 2021 IST | Sowmya
Updated At - 03:44 PM Sep 06, 2021 IST
film news  పిచ్ఛ పిచ్చగా నచ్చేసే  పీప్ షో  ఆటో రాంప్రసాద్ అదరగొట్టేసాడు   పీప్ షో  పోస్టర్ లాంచ్ ఫంక్షన్ లో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది గెటప్ శ్రీను
Advertisement

Jabardast Ramprasad PEEP SHOW Movie Poster Launch, Sudigali Sudheer, Hyper Aadi, Getup Srinu, Heroine Nehadesh Pande, Latest Telugu Movies, Telugu World Now,

FILM NEWS: పిచ్ఛ పిచ్చగా నచ్చేసే *పీప్ షో* ఆటో రాంప్రసాద్ అదరగొట్టేసాడు -"పీప్ షో" పోస్టర్ లాంచ్ ఫంక్షన్ లో సుడిగాలి సుధీర్-హైపర్ ఆది-గెటప్ శ్రీను

Advertisement GKSC

సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో యువనిర్మాత ఎస్.ఆర్.కుమార్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే.

జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. జబర్దస్త్ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

"స్వతహా రైటర్ అయిన ఆటో రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న "పీప్ షో" కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, అందరికీ విపరీతంగా నచ్చుతుందని" అతిధులుగా హాజరైన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అన్నారు. "హీరోగా రాంప్రసాద్, దర్శకుడిగా క్రాంతి కుమార్, నిర్మాతలుగా "ఎస్.ఆర్.కుమార్-సురేష్ కాకుమాని"లకు మంచి పేరు తెస్తుందని" పేర్కొన్నారు.

Jabardast Ramprasad PEEP SHOW Movie Poster Launch, Sudigali Sudheer, Hyper Aadi, Getup Srinu, Heroine Nehadesh Pande, Latest Telugu Movies, Telugu World Now,బుల్లి తెరపై కామెడీ సునామి సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను "పీప్ షో" ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం పట్ల హీరో ఆటో రాంప్రసాద్, దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాత సురేష్ కాకుమాని, హీరోయిన్ నేహాదేశ్ పాండే సంతోషం వ్యక్తం చేశారు. "పీప్ షో" తమ బ్యానర్ "సుప్రీమ్ డ్రీమ్స్"కు మంచి శుభారంభం ఇస్తుందని తెలిపారు.

Jabardast Ramprasad PEEP SHOW Movie Poster Launch, Sudigali Sudheer, Hyper Aadi, Getup Srinu, Heroine Nehadesh Pande, Latest Telugu Movies, Telugu World Now,ఈ కార్యక్రమంలో ఈ చిత్ర కెమెరామెన్ ఈశ్వర్, ఎడిటర్ సునీల్ మహారాణ కూడా పాల్గొని ఇంత మంచి చిత్రంతో అసోసియేట్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాగ్, సంధ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసిస్టెంట్ డైరెక్టర్స్: ఆనంద్ రెడ్డి-నాని, కో-డైరెక్టర్: ఆర్.కె.రాజు, ప్రొడక్షన్ మేనేజర్: నవీన్ ప్రకాష్, సినిమాటోగ్రఫీ: ఈశ్వర్, ఎడిటింగ్: సునీల్ మహారాణ, స్క్రిప్ట్ అసోసియేట్: లుధీర్ బైరెడ్డి, ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ కాకుమాని, నిర్మాత: ఎస్.ఆర్.కుమార్, రచన-దర్శకత్వం: క్రాంతికుమార్.సి.హెచ్!!

Jabardast Ramprasad PEEP SHOW Movie Poster Launch, Sudigali Sudheer, Hyper Aadi, Getup Srinu, Heroine Nehadesh Pande, Latest Telugu Movies, Telugu World Now,

Advertisement
Author Image