For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhutala Bangla : ఇలాంటి మంచి ఎంటర్ టైనర్ తో తెలుగులోకి రావడం ఆనందగా వుంది : హీరో సంతానం

12:39 AM Aug 13, 2023 IST | Sowmya
Updated At - 12:39 AM Aug 13, 2023 IST
bhutala bangla   ఇలాంటి మంచి ఎంటర్ టైనర్ తో తెలుగులోకి రావడం ఆనందగా వుంది   హీరో సంతానం
Advertisement

మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచతమైన పాపులర్ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హిలేరియస్ యూనిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి యస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ పై  సి. రమేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం జులై 29న తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతిష్టాత్మక నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఆగష్టు 18న ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో యూనిట్ తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేసింది.

Advertisement GKSC

ప్రెస్ మీట్ లో హీరో సంతానం మాట్లాడుతూ.. ‘డీడీ రిటర్న్స్’ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూశాను. సినిమా విడుదలైతే అందరూ ఎంజాయ్ చేసేలా వుండాలని అనుకున్నాను. ఇప్పుడు  ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ చిత్రంతో తెలుగులోకి రావడం ఆనందంగా వుంది.  అందరూఎంజాయ్ చేసే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు రియల్ సినిమా లవర్స్. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని సాధించింది.

ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆర్ బి చౌదరి గారు , ఎన్ వి ప్రసాద్ గారి కి ధన్యవాదాలు.  ‘భూతాల బంగ్లా’’ చిత్రం ఒక రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. హారర్ కామెడీ విత్ గేమ్ తో వున్న ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా యునిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆగస్ట్ 18 ఈ చిత్రం మీ ముందుకు వస్తోంది. ఈ మంచి చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

Advertisement
Author Image