For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఇష్క్ మా జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతి క‌ల్గించింది

01:13 PM Feb 25, 2022 IST | Sowmya
Updated At - 01:13 PM Feb 25, 2022 IST
ఇష్క్ మా జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతి క‌ల్గించింది
Advertisement

నితిన్, నిత్య మీనన్ జంట‌గా న‌టించిన సినిమా ఇష్క్. 2012, ఫిబ్రవరి 24న విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని చ‌విచూసింది.  శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. ఈ సంద‌ర్భంగా చిత్రంలో న‌టించిన నితిన్, నిత్య మీనన్ త‌మ ఆనందాన్ని ఇలా ఆవిష్క‌రించారు.

హీరో నితిన్ మాట్లాడుతూ, ఈనెల 24కు ప‌దేళ్ళు ఇష్క్ పూర్తి చేసుకుంటుంది. నా కెరీర్‌లో మెమొర‌ల‌బుల్ సినిమా. న‌టుడిగా నాకు రీ బ‌ర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ నాకు ఇచ్చారు. ఇష్క్ సినిమా స్పెష‌ల్‌గా రావ‌డానికి కార‌ణం క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం, పి.సి. శ్రీ‌రామ్ విజువ‌ల్స్‌, అనూప్, అర‌వింద్ మంచి సంగీతం ఇచ్చారు. నాది, నిత్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ డ్రీమ్ టీమ్‌తో మ‌రోసారి సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారుIshq Is A Memorable Film And It’s A Rebirth For Me As An Actor  Nithiin telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1నిత్య మీన‌న్ మాట్లాడుతూ, ఇష్క్ నా సెకండ్‌మూవీ. నా హృద‌యాన్ని ట‌చ్ చేసిన‌ సినిమా.. ఇప్పుడు కూడా ఎక్క‌డికి వెళినా. `ప్రియా ప్రియా` సాంగ్‌. పాడ‌మ‌ని అడుగుతుంటారు. అనూప్ నాచేత పాడించారు. విక్ర‌మ్ కుమార్ గారు క్యూట్ ఫిలింగా తీశారు. నాకు చాలా ఆనందంగా వుంది. అప్పుడే ద‌శాబ్దం అయిందా! అనిపించింది. అంద‌రం వేరే వేరే చోట వుండ‌డంతో సెల‌బ్రేష‌న్ చేసుకోలేక‌పోతున్నాం. త్వ‌ర‌లో క‌లుస్తాం అని చెప్పారు.

Advertisement GKSC

Advertisement
Author Image