For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

The Untold Story : జయరామ్ 'ది అన్‌టోల్డ్ స్టోరీ' సిల్క్ స్మితగా 'చంద్రిక రవి'

11:04 PM Dec 02, 2023 IST | Sowmya
Updated At - 11:04 PM Dec 02, 2023 IST
the untold story   జయరామ్  ది అన్‌టోల్డ్ స్టోరీ  సిల్క్ స్మితగా  చంద్రిక రవి
Advertisement

80, 90వ దశకాల్లో గ్లామరస్ తారగా వెలుగొందారు సిల్క్ స్మిత. గ్లామరస్ పాత్రలు, పాటల్లో మెరిసిన ఆమె పీక్ పీరియడ్‌లో బిగ్గెస్ట్ క్రౌడ్-పుల్లర్‌ గా అలరించారు. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె జయంతి పురస్కరించుకొని సిల్క్ స్మిత బయోపిక్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు జయరామ్. ఇటీవల 'వీరసింహారెడ్డి' సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో అలరించిన చంద్రిక రవి సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తున్నారు. ఎస్‌టిఆర్‌ఐ సినిమాస్‌ పై ఎస్ బి విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వి. మహాస్త్రీ అమృతరాజ్ సమర్పిస్తారు.

ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడమే కాకుండా, మేకర్స్ చంద్రిక రవి పాత్రను సిల్క్ స్మితగా పరిచయం చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అచ్చు సిల్క్ స్మితలానే కనిపించారు చంద్రిక రవి. చీర ధరించి, నుదిటిపై బిందీ, సొగసైన కళ్ళుతో గోళ్లు కొరుకుతూ ప్రజెంట్ చేసిన లుక్ లో సిల్క్ స్మితలా ప్రేక్షకులని మురిపించారు చంద్రిక రవి.

Advertisement GKSC

ఆమె కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, మేకర్స్ సిల్క్ స్మిత 'ది అన్‌టోల్డ్ స్టోరీ'ని ప్రపంచానికి చెప్పనున్నారు. సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని 2024లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

తారాగణం : చంద్రిక రవి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: జయరామ్
నిర్మాత: ఎస్ బి విజయ్
బ్యానర్: STRI సినిమాస్
సమర్పణ: వి. మహాస్త్రీ అమృతరాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image